డి. సురేష్ బాబు స్ట్రాటజీలు పక్కాగా ఉంటాయి. ఆయన ఓ సినిమా ముట్టుకొన్నారంటే.. కచ్చితంతోఅందులో విషయం ఉండే ఉంటుంది. పెళ్లి చూపులు సినిమానిచూసి, దాన్ని భారీ ఎత్తున ప్రమోషన్స్ చేసి – ఓ పెద్ద సినిమా స్థాయిలోవిడుదల చేశారు.. కనీ వినీ ఎరుగని లాభాల్ని అందుకొన్నారు. ఇప్పుడు ఆయన చేతిలోకి మరో చిన్న సినిమా వెళ్లింది. అదే ‘కాదలి’. ఈసినిమా ప్రొడక్షన్ కీ డి.సురేష్ బాబుకీ ఎలాంటి సంబంధం లేదు. సినిమా చూసి, నచ్చి, తన డిస్టిబ్యూషన్ కంపెనీ ద్వారా రిలీజ్ చేస్తున్నాడు. సాధారణంగా సురేష్ బాబు చేతుల్లోకి సినిమా వెళ్లిందంటే.. దాని ప్రమోషన్లు అదిరిపోతాయి. ప్రతీ రోజూ ఓ ప్రెస్ మీట్.. ఓ ఇంటర్వ్యూ.. రామానాయుడు స్టూడియోలో షోలూ… జరుగుతూనే ఉంటాయి. కానీ.. కాదలి విషయంలో సురేష్ బాబు ఆ ఉత్సాహం చూపించకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఈ సినిమా ఆడియో ఫంక్షన్‌కి రామ్ చరణ్, కేటీఆర్ వచ్చారు. సమంత ట్విట్టర్లో ప్రచార చిత్రాల్ని విడుదల చేసింది. ఇదంతా దర్శకుడు పట్టాభి చలవే. సురేష్ బాబు తన వంతుగా చేసిందేం లేదు. సురేష్ బాబు ‘కాదలి’ని తీసుకొన్నప్పుడు ఇది కూడా ‘పెళ్లి చూపులు’ స్థాయిలో ఆడేస్తుందని, దానికి ఆ టైపు హైపు రావడం ఖాయమని అనుకొన్నారు. తీరా చూస్తే… సురేష్ బాబు ఈ సినిమాకి హ్యాండిచ్చేశారు. ఇంతలోనే ఏం జరిగిందో మరి. రేపు (శుక్రవారం) ఈ సినిమా విడుదల అవుతోంది. సురేష్ బాబు వాలకం చూస్తుంటే… ఈ సినిమాపై డౌటు కొడుతోంది. ఏం జరుగుతుందో చూడాలి.