తెలంగాణలో కాంగ్రెస్ తరపున గట్టిగా వినిపించే కనిపించే నాయకులలో జగ్గారెడ్డి ఒకరు. ఆయన కారణంగానే రాహుల్‌గాంధీ సభ సంగారెడ్డిలో పెట్టారు. ఆ వేదికపై ఈ సంగతి ప్రస్తావనకు వచ్చింది కూడా. అంతా జగ్గారెడ్డి భరించాడని వి.హనుమంతరావు అంటుంటే మీరేమీ ఇచ్చారని రాహుల్ అడిగారు. నా దగ్గరేముంది అని ఈయన అంటే చేతికి బ్రేస్లెట్ వుంది కదా ఇవ్వమని చెప్పారు. దాంతో ఒక రోజు విహెచ్ వెళ్లి జగ్గారెడ్డికి బ్రేస్లెట్ తొడగడం ఒక వార్త అయింది. అక్కడికి ఆగకుండా ఈరోజు ఆయన దాన్ని వేలం వేశారు. అయిదు తులాల ఆ బ్రేస్లెట్ విలువ రు4 లక్షలు కావచ్చు కాని వేలంలో 20 లక్షలకు పాడారట. రిషి డెవలపర్స్ అధినేతలు ఇందుకు ముందుకు వచ్చారట. ఇందులో ఎవరి ఆసక్తి ఏమిటో గాని మొత్తానికి అంతా తమాషాగా జరిగిపోయింది.ఈ వచ్చిన డబ్బును ఖమ్మం మిర్చి రైతులకు అందిస్తానని జగ్గారెడ్డి ప్రకటించారు. మొత్తానికి కాంగ్రెస్‌కు మూడు నాలుగు సార్లు పబ్లిసిటీ రావడానికి ఈ తతంగం కారణమైంది.