శోభన.. 80, 90 దశకాల్లో వెండితెరను మైమరపించిన హీరోయిన్. ఇప్పటికీ శోభనను అభిమానించే అభిమానులు వున్నారు. ఆమె అందచందాలు, నటనా కౌశలం ఒక ఎత్తు అయితే, శోభన నాట్యం మరో లెవల్. భరతనాట్యంను అవపోషణ పట్టిన కళాకారుల్లో శోభన ఒకరు. ఆమె నాట్య ప్రతిభకు పద్మశ్రీ వరించింది. అదూర్ గోపాల్ కృష్ణన్ , జి అరవింద్ , కే బాలచందర్, మణిరత్నం.. లాంటి వెటరన్ దర్శకులతో కలసి పని చేసే అవకాశం అందుకుంది శోభన. అయితే హీరోయిన్ గా అవకాశాలు తగ్గిన తర్వాత నాట్యం పై పూర్తి స్థాయిలో ద్రుష్టి పెట్టింది. ఈ క్రమంలో జాకీర్ హుస్సేన్ , మాండలిన్ శ్రీనివాస్, మణిరత్నం- ఏ ఆర్ రెహ్మాన్ లాంటి దిగ్గజాలతో కలసి దేశ విదేశాల్లో నాట్య ప్రదర్శనలు ఇచ్చింది.
అనంతరం తనే స్వయంగా ఓ భరతనాట్యం స్కూల్ ను ప్రారంభించి అనేక మంది విద్యార్ధులకు భరతనాట్యం నేర్పించే భాద్యతను తీసుకుంది. అయితే ఈ కళా పోషణలో పడి తన వ్యక్తిగత జీవితంపై పెద్దగా ఫోకస్ చేయలేదు శోభన. 47ఏళ్ళ శోభనకు ఇంకా పెళ్లి కాలేదు. ఏవో వ్యక్తిగత కారణాలు వల్ల తన జీవితంలో పెళ్లి అనే పేజీ తెరవలేదు శోభన. ఓ ఆడపిల్లను దత్తత తీసుకొని పెంచుకుటుందంతే.
అయితే ఇప్పుడీ వెటరన్ లేడీకి పెళ్లి పై మనసు మళ్లిందట. త్వరలోనే తన ఫ్యామిలీ ఫ్రెండ్ తో కలసి మూడు ముళ్ళ బంధంలోకి అడుగుపెట్టాలని భావిస్తుందట శోభన. ఇప్పుడు ఇవే వార్తలు మీడియాలో వినిపిస్తునాయి. అయితే ఇలా శోభన పెళ్లి వార్తలు రావడం కొత్తేం కాదు. గతంలో కూడా చాలా సార్లు శోభన పెళ్లి కబుర్లు హాల్ చల్ చేశాయి. మరి ఈసారి వార్తలు వాస్తవ రూపం దాల్చుతాయో లేదో చూడాలి.