అల్లుడు శ్రీనుతో ఎంట్రీ ఇచ్చాడు బెల్లంకొండ శ్రీనివాస్. ఈ కుర్రాడిలో టాలెంటూ, టైమింగూ మస్తుగా ఉన్నా – తొలి సినిమా వినాయక్ ఊపులో పోయింది. ఆ సినిమాకి భారీగా ఖర్చు పెట్టి తనయుడిపై ప్రేమ చూపించుకొన్నాడు బెల్లంకొండ సురేష్. రెండో సినిమా స్పీడున్నోడు ఓవర్ స్లోగా నడిచింది. దాంతో రెండో సినిమాకే ఫ్లాప్ చూడాల్సివచ్చింది. మూడో సినిమాకి అప్రమత్తమైపోయి – బోయపాటి శ్రీనుని రంగంలోకి దించారు. సినిమా పూర్తయి.. ఇప్పుడు విడుదలకు సిద్ధమైంది. ఈ సినిమాని నైజాంలో దిల్ రాజు రూ.9 కోట్లకు కొన్నాడని వినికిడి. శాటిలైట్‌తో కలుపుకొని రూ.50 కోట్ల వరకూ బిజినెస్ చేసే అవకాశాలున్నాయట.
ఇదంతా బెల్లం కొండ శ్రీనివాస్ రేంజు అనుకొంటే పొరపాటు. బోయపాటి శ్రీను… తడాఖా ఇది. మాస్ – ఎంటర్టైన్మెంట్ సినిమాలతో వరుస హిట్లు కొడుతూ వస్తున్నాడు బోయపాటి. సరైనోడు దాదాపు రూ.70 కోట్లు సాధించింది. బోయపాటి కి దమ్ములాంటి ఫ్లాప్ ఉన్నా.. తన ఖాతాలో చెత్త సినిమాలేం లేవు. సో.. బోయపాటిపై ట్రేడ్ వర్గాల్లో బోల్డంత నమ్మకం ఉంది. ఆ నమ్మకంతోనే.. ఈ సినిమాపై అంచనాలు పెంచుకొన్నారు. రూపాయి ఖర్చు పెట్టాలంటే పది రకాలుగా ఆలోచించే దిల్ రాజు ఈ సినిమాపై 9 కోట్లు పెట్టడానికి వచ్చాడంటే… అదంతా బోయపాటిపై ఉన్న నమ్మకమే. మరి… జయ జానకీ నాయక దాన్ని అందుకొంటుందో లేదో చూడాలి.