లీడర్ లాంటి పొలిటికల్ డ్రామాతో కెరీర్ కు శ్రీకారం చుట్టిన దగ్గుబాటి రానా ఇపుడు మరో పొలిటికల్ థ్రిల్లర్ ని చేస్తున్నాడు. అదే ‘నేనే రాజు నేనే మంత్రి’. తేజ దర్శకుడు. ఈ చిత్ర ట్రైలర్ ఈరోజు విడుదలైంది. ఇందులో పొలిటికల్ పంచులు పేలిపోయాయి. ప్రస్తుతం జరుగుతున్న పొలిటికల్ డ్రామా ను ప్రెజెంట్ చేసేలా వున్నాయి ఈ డైలాగులు. ”సిఎం అయితే ఎవడికి గొప్ప. వందమంది ఎమ్మెల్యేలను స్టార్ హోటల్కి తీసుకెళ్తే.. నేను ముఖ్యమంత్రినే” అని రానా పలికిన డైలాగ్ సరిగ్గా తగలాల్సిన చోట తగిలింది.
స్టార్ హోటల్ రాజకీయం అంటే చంద్రబాబు నాయుడే గుర్తుకు వస్తారు తెలుగు రాష్ట్రాలలో. ‘ఎన్టీఆర్ కి వెన్నుపోటు’ ఎపిసోడ్ లో రాజకీయం నడిచింది ఓ స్టార్ హోటల్ నుండే. ఈ ఘటనతోనే ఎన్టీఆర్ సగం చచ్చిపోయారని మొన్నామధ్య దేవినేని నెహ్రూ తన మనోగతాన్ని వెల్లడించారు.
ఈ ఎపిసోడ్ విషయంలో చంద్రబాబు పై అనేక విమర్శలు ఆరోపణలు వున్నాయి. ఇప్పుడు తేజ కూడా రానాతో ‘వెన్నుపోటు’ గుర్తుకు వచ్చేలా ఓ డైలాగ్ చెప్పించాడు. ట్రైలర్ పక్కన పెడితే ఇప్పుడు ఇదే డైలాగ్ గురించి అంతా చర్చించుకుంటున్నారు. ప్రస్తుతం బాబు అధికారంలో వున్నది చంద్రబాబే. మరి ఈ డైలాగ్ ని డైలాగ్ గానే చూస్తారా ? లేదా సెన్సార్ కష్టాలు చుట్టూ ముడతాయో వేచి చూడాలి.