చిరంజీవి 152వ చిత్రం బోయపాటి శ్రీనుతో దాదాపుగా ఖాయమైపోయినట్టే. ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ తెరకెక్కించనున్న సంగతి తెలిసిందే. ఈ వారంలోనే చిరుకి కథ చెప్పబోతున్నాడు బోయపాటి. అయితే.. బోయపాటి నుంచి కండీషన్ ఒకటి వినిపిస్తోంది. ప్రస్తుతం బెల్లంకొండ శ్రీనివాస్ తో ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు బోయపాటి. ఆ సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తయింది. ఆగస్టులో ఈ సినిమాని విడుదల చేస్తారు. ఆతరవాత.. చిరుతో సినిమా పట్టాలెక్కించాలి. నవంబరులోగా సినిమా మొదలెడతానంటే… చిరు కోసం బోయపాటి ఎదురు చూస్తాడట. లేదంటే ఈలోగా మరో హీరోతో ప్రొసీడ్ అవుతానని అంటున్నాడట. ప్రస్తుతం చిరంజీవి ఉయ్యాల వాడ స్క్రిప్టు పనుల్లో బిజీగా ఉన్నాడు. ఆగస్టులో ఈ సినిమా పట్టాలెక్కుతోంది. మూడు నెలల్లో ఈ సినిమా పూర్తి చేయడం అసాధ్యం. కాబట్టి.. చిరంజీవి దగ్గర రెండు ఆప్షన్లున్నాయి. ఒకటి.. ఈలోగా బోయపాటికి మరో సినిమా చేసుకొనే ఛాన్స్ ఇవ్వడం, రెండోది… కనీసం జనవరిలో అయినా.. బోయపాటి సినిమాని మొదలెట్టడం. ఉయ్యాలవాడ చివరి దశకు వచ్చే దశలో… సమాంతరంగా బోయపాటి సినిమాని కూడా పట్టాలెక్కించే అవకాశాలున్నాయి. చిరంజీవి కోసం బోయపాటి జనవరి వరకూ ఆగుతాడనడంలో సందేహం లేదు. ఉయ్యాల వాడ పూర్తయేంత వరకూ మరో సినిమా ఒప్పుకొనేది లేదని చిరు పట్టుపడితే గనుక.. బోయపాటి – చిరంజీవి కాంబినేషన్ కోసం మరికొన్నాళ్లు ఎదురుచూడక తప్పదు.