డ్రగ్స్ కేసులో ఛార్మి విచారణ ఈరోజు జరుగుతోంది. ఉదయం 9.45కే సిట్ కార్యాలయానికి చేరుకొన్న ఛార్మి ప్రస్తుతం.. విచారణని ఎదుర్కొంటోంది. కెల్విన్కీ, ఛార్మీకి దగ్గర సంబంధాలున్నాయన్నది సిట్ అధికారుల అనుమానం. ఇందుకు సంబంధించి బలమైన ఆధారాల్ని కూడా అధికారులు సేకరించారు. కెల్విన్ సెల్ఫోన్లో ఛార్మి నెంబర్ని ‘ఛార్మి దాదా’ అనే పేరుతో సేవ్ అయి ఉంది. అందులో దాదాపుగా 1000 మెసేజీలు ఉన్నాయట. చాలా మెసేజీలు కోడ్ భాషలోనే సాగాయని తెలుస్తోంది. ఇవే… ఛార్మిని ఇరుకున పెట్టే సూచనలు కనిపిస్తున్నాయి. ఛార్మి కోసం సిట్ అధికారులు దాదాపు 70 ప్రశ్నల్ని సిద్ధం చేశారని తెలుస్తోంది. పూరికీ ఛార్మికీ మధ్య ఉన్న సంబంధాలపై కూడా వాళ్లు ఆరా తీస్తున్నట్టు వినికిడి. గోవా, బ్యాంకాక్, పూరీ ఆఫీసులో జరిగే పార్టీలకు చార్మి ఎన్నిసార్లు హాజరైంది? అక్కడ ఎవరెవర్ని చూసింది? అనే విషయాలపై సిట్ లోతుగా… విచారణ చేయనుంది. హై కోర్టు ఆదేశాల మేరకు.. సాయింత్రం 5 గంటల వరకే ఛార్మిని విచారించాల్సివుంది. అవసరమైతే మరుసటి రోజు విచారణకు పిలవొచ్చు. నిన్నటి వరకూ సినీ సెలబ్రెటీలంతా వైట్ డ్రస్సులో సిట్ ఆఫీసుకు వచ్చారు. అయితే ఛార్మి మాత్రం బ్లూ డ్రస్సులో కనిపించింది.