అనుకున్నట్టుగానే కాపునేత ముద్రగడ పద్మనాభంపై గృహ నిర్బంధం విధించారు. 24 గంటలు ఇది వుంటుందని డిఎస్పి విశ్వజిత్ సేన్ చెబుతున్నారు. వాస్తవంలో అంతకంటే బాగా ఎక్కువ రోజులే సాగించడం తథ్యంగా కనిపిస్తుంది.
వివిధ చోట్ల పోలీసు అధికారులు తమ చర్యను సమర్థించుకుంటూ మాట్లాడుతున్నారు. అనుమతి లేనందున కోరనందున అరెస్టు చేయవలసి వచ్చిందని మరెవరు పాల్గొన్నా అదే జరుగుతుందని హెచ్చరిస్తున్నారు. పాదయాత్ర కోసం బయిటకు వచ్చిన ముద్రగడను పోలీసులు మాట్లాడి ఇంట్లొకి పంచించారు. కిర్లంపూడికి బస్సులు నిలిపివేశారు. పశ్చిమ గోదావరి గుంటూరు కృష్ణా జిల్లాలోనూ ఇదే విధమైన కట్టుదిట్టాలు చేశారు. ముద్రగడ కోరితే పాదయాత్రకు అనుమతినిచ్చేవాళ్లమని ఆయన అడగలేదని ఉప ముఖ్యమంత్రి నిమ్మకాలయ చిన రాజప్ప సెలవిచ్చారు. షరా మామూలుగా వైసీపీ నేతలు ఈ అరెస్టులపై తీవ్రంగా స్పందిస్తున్నారు. ఎపి బిజెపి నేత అద్దేపల్లి శ్రీధర్ కూడా కాపులకు చేసినవాగ్దానం నిలబెట్టుకోవాలని ఆయన సూచించారు. మొత్తంపైన ముద్రగడ ఆందోళన గట్టి ప్రభావమే చూపించే అవకాశం కనిపిస్తున్నది.