సినిమా సినిమాకీ తన లుక్ మార్చడం అల్లు అర్జున్ స్టైల్! అందుకే స్టైలీష్ స్టార్ అయ్యాడు. తన కొత్త సినిమా నా పేరు సూర్య – నా ఇల్లు ఇండియా కోసం బన్నీ సరికొత్త అవతారంలో కనిపించనున్నాడు. ఇందులో మిలటరీ అధికారిగా కనిపించబోతున్నాడు బన్నీ. అందుకోసం అమెరికా వెళ్లి… అక్కడ శిక్షణ తీసుకోబోతున్నట్టుగా వార్తలొచ్చాయి. తిరిగొచ్చాకే షూటింగ్ మొదలెడతారని అన్నారు. అయితే.. బన్నీ అమెరికా వెళ్లడం లేదట. అమెరికా నుంచే ఓ శిక్షకుడు హైదరాబాద్ వస్తున్నాడట. ఇక్కడే… బన్నీ శిక్షణ తీసుకోబోతున్నాడని చిత్రబృందం క్లియర్ చేసింది. పీఆర్వో చిన్న కమ్యునికేషన్ గ్యాప్ వల్ల.. బన్నీ అమెరికా వెళ్లబోతున్నట్టు ఇది వరకు వార్తలొచ్చాయి. బన్నీ శిక్షణ తీసుకోబోతున్నది నిజమే కానీ, అందుకోసం అల్లు అర్జున్ అమెరికా వెళ్లడం లేదని, అక్కడి నుంచి ఓ శిక్షకుడు వచ్చి బన్నీకి ట్రైనింగ్ ఇస్తారని చిత్రబృందం క్లారిటీగా చెప్పేసింది. వక్కంతం వంశీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో అను ఇమ్మానియేల్ కథానాయికగా నటిస్తోంది. ఆగస్టు 12 నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలెడతాను. విశాల్ శేఖర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.