చిరంజీవి 2008 లో స్థాపించిన పీఅర్ పి 2009 ఎన్నికల్లో బోల్తాపడటం, ఆ తరువాత కాంగ్రెస్ లో విలీనం అవడం ఇవన్నీ తెలిసిన విషయాలే. అయితే పీఅర్ పి ని అందరూ మరిచిపోయినా దాన్ని మరిచిపోని వ్యక్తి ఒకరున్నారు. అతనే పవన్ కళ్యాణ్. పీఅర్ పి లో జరిగిన పొరపాట్ల నుంచి తాను ఎన్నో విషయాలు నేర్చున్నానని చెప్పే ఆయన, తెలీకుండానే పీఅర్ పి లో జరిగిన మిస్టేక్ ని జనసేన లో పునరావృతం చేస్తున్నారా? ఇవే సందేహాలొస్తునాయిప్పుడు.
2019 లో రాబోయే ఎన్నికలకి 2017 అక్టోబర్ నుంచి పూర్తి స్థాయి లో సమయం కేటాయిస్తానని ఆల్రెడీ ప్రకటిచాడు పవన్ కళ్యాణ్. అయితే ఇప్పుడు దేశం మొత్తం వినిపిస్తున్న మాట -ముందస్తు ఎన్నికలు. నిజానికి కేంద్రం దేశం మొత్తానికి ఒకేసారి ఎన్నికలు జరపాలని ప్రయత్నించింది. కానీ దానికి చాలా ప్రాక్టికల్ ప్రాబ్లెంస్ ఉండటం తో ముందస్తు గా 2018 డిసెంబర్ లోనే ఎలక్షన్స్ కి వెళ్ళాలని భావిస్తోంది. ఇక ఇద్దరు తెలుగు రాష్ట్రాల ‘చంద్రులు ‘ కూడా దీనికి సిద్దంగానే ఉన్నరు. సో 2019 సార్వత్రిక ఎన్నికలతో పాటు తెలుగు రాష్ట్రాల ఎన్నికలు కూడా 2018 ఆఖర్న జరిగితే పవన్ కళ్యాన్ కి పార్టీ ని కేడర్ ని నిర్మించడానికి సమయం దొరకదని, క్షేత్ర స్థాయి లో దెబ్బ తగులుతుందని విశ్లేషణలు జరుగుతున్నాయి.చిరంజీవి కూడా పి ఆర్ పి ని ఎన్నికలకి కేవలం 8 నెలల ముందు స్థాపించి ఇలాగే నష్టపోయాడని అంటున్నారు విశ్లేషకులు.
అయితే ఇది పవన్ కి పెద్ద సమస్య కాబోదని అంటున్నారు అభిమానులు, జనసేన వర్గాలు. నిజానికి పవన్ చాప కింద నీరు లా చాలా రోజులుగా పని చేసుకుంటూ పోతున్నాడని, ఆల్రెడీ తెర వెనుక చాల మంది నాయకులతో చర్చలు పూర్తయ్యాయనీ అంటున్నారు. వైసిపి కంటే చాలా ముందుగా మేల్కొని సిపిఎం తో చర్చలు జరపడం వల్లే జనసేన సిపిఎం ల మధ్య అవగాహన ఒప్పందం పూర్తయిందనీ అంటున్నారు. ఏది ఏమైనా పీఅర్ పి మిస్టేక్ జనసేనలో పునరావృతం అయ్యే అవకాశాలు తక్కువే అయినప్పటికీ పరిస్థితులు ఎలా టర్న్ అవుతాయో చూడాలి.