సిద్ధార్థ్ .. లవర్ ఇమేజ్ తో ఓ వెలుగు వెలిగాడు. బొమ్మరిల్లు లాంటి క్లాసిక్ సినిమా కూడా ఆయన ఖాతాలో ఉంది. ఐతే సడన్ గా ఆయన కెరీర్ డల్ అయిపోయింది. అసలు సిద్దు నుండి సినిమాలే లేకుండాపోయాయి. అయితే ”ఇది గ్యాప్ కాదు. తనని తాను కొత్తగా ఆవిష్కరించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నా. ఈ క్రమంలో కొత్త కధలు వింటున్న. ఎవరూ టచ్ చేయని జోనర్ సినిమాలు చేయడానికి సిధ్ధం అవుతున్నా. అందుకే నా నుండి సినిమాలు రావడం ఆలస్యం అవుతుంది” అని చెబుతుంటాడు సిద్దు.
ఇప్పుడు చాలా రోజుల తర్వాత సిద్ధార్థ్ నుండి ఓ సినిమా వస్తుంది. అదే ‘ది హౌస్ నెక్ట్స్ డోర్’ . హారర్ జోనర్ సినిమా ఇది. ఈ చిత్రానికి మిలింద్ రావ్ దర్శకత్వం. ఈ సినిమాని తెలుగులో ‘గృహం’ అనే పేరుతో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. తాజాగా ఈ సినిమా టీజర్ బయటికివచ్చింది. ఇదో హారర్ థ్రిల్లర్. టీజర్ మొత్తం అదే జోనర్ లో సాగింది. ఈమధ్య కాలంలో హారర్ అని చెప్పి కామెడీ కూడా దూర్చేస్తున్నారు. కానీ సిద్దు మాత్రం కంప్లీట్ గా ఓ హారర్ థ్రిల్లర్ ని ఇవ్వాలనే ఈ సినిమా చేసినట్లు అనిపిస్తుంది. టీజర్ గ్రిప్పింగ్ గా కట్ చేశారు. హారర్ సినిమాలు జనరల్ గా ఎదో ఓ ఇంటి చుట్టూ లేదా ఓ బంగ్లా చుట్టూ తిరుగుతుంటాయి. ”గృహం’లో కూడా ఓ ఇంట్లో జరిగిన భయానక సంఘటనలు చూపిస్తారని టీజర్ చూస్తే అర్ధం అవుతుంది. అయితే హాలీవుడ్ హారర్ సినిమాల మాదిరిగా హారర్ జోనర్ ఫీల్ సినిమాటోగ్రఫీతో ఓ థ్రిల్లర్ చూసే అవకాశం అయితే వుందనిపిస్తుంది టీజర్ చూస్తే. సిద్ధార్థ్ కి ఇలాంటి జోనర్ సినిమాలు కొత్త. ఇప్పుడు చాలా రోజుల తర్వాత తనకు కొత్తగా వుండే సినిమాతో వస్తున్నాడు సిద్దు. మరి ఈ సినిమా సిద్ధార్థ్ కెరీర్ కు ఎలాంటి టర్నింగ్ పాయింట్ అవుతుందో చూడాలి.