కమల్ హాసన్ రాజకీయ రంగ ప్రవేశానికి సిద్దమౌతున్నారు. త్వరలో కొత్త పార్టీ పెట్టబోతున్నానని కమల్ హాసన్ ఇటీవలే ప్రకటించిన విషయం తెలిసిందే. నవంబర్ 7న, తన పుట్టినరోజు సందర్భంగా ఆయన కొత్త పార్టీని ప్రకటించనున్నట్లు సమాచారం.
తన పార్టీతో తమిళనాడుకు మంచి రోజులు వస్తాయని, గత, ప్రస్తుత పాలనలో ప్రజలు కష్టాలు పడుతున్నారని కమల్ హాసన్ అన్నారు. తన పార్టీ డీఎంకే, అన్నాడీఎంకేకు వ్యతిరేకంగానే ఉంటుందని, అవినీతిపై పోరాటం కొనసాగుతుందని కమల్ స్పష్టం చేశారు. కమల్ అభిమాన సంఘాల జిల్లా కార్యదర్శులతో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. పార్టీ ఆవిర్భావం, జెండా-అజెండా, పార్టీ విధివిధానాల గురించి వారితో చర్చించారు.
మరి కమల్ పార్టీ, విజయ్ కాంత్ పార్టీ లాగా చరిత్రలో కలిసిపోతుందా లేక ఎంజీఆర్ పార్టీ లాగ చరిత్ర సృష్టిన్స్తుందా అనేది వేచి చూడాలి.