రేపే నాగచైతన్య – సమంతల పెళ్లి. చిత్రసీమ అంతా ఈ పెళ్లికోసం కొన్నాళ్లుగా ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఆ శుభఘడియలు దగ్గరపడ్డాయి. శుక్రవారం రాత్రి 11గంటల52 నిమిషాలకు వీరిద్దరి పెళ్లి శాస్త్రోక్తంగా జరగబోతోంది. పెళ్లి నిడారంబరంగా జరుగుతుందని నాగార్జున చెప్పినా – భారీ ఏర్పాట్లే జరుగుతున్నాయని సమాచారం. ఈపెళ్లికి దాదాపు రూ.10 కోట్లు ఖర్చు పెడుతున్నారని టాక్ వినిపిస్తోంది. పెళ్లికి విడిది ఇస్తున్న డబ్ల్యూ హోటెల్ అద్దె లక్షల్లో ఉందట. నాలుగురోజుల అద్దె దాదాపుగా కోటి రూపాయలు ఉంటుందని తెలుస్తోంది. అన్నట్టు ఈ పెళ్లిలో సమంతకు ఓ సర్ప్రైజ్ గిఫ్ట్ ఇవ్వబోతోంది అక్కినేని కుటుంబం. సమంతని తమకుటుంబంలోకి ఆహ్వానిస్తూ…. అక్కినేని కుటుంబం అంతా కలసి ఓ వీడియో చేశారట. అది ఈ పెళ్లిలోనే ప్రదర్శిస్తారని తెలుస్తోంది. ఈపెళ్లికి ఈ వీడియోనే అతిపెద్ద హైలెట్ అవ్వబోతోందట. సరిగ్గా రామానాయుడు కుటుంబం కూడా ఇలాంటి సర్ప్రైజ్ గిఫ్ట్ ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. సమంత కోసం ఖరీదైన గిఫ్ట్ ఒకటి రెడీ చేశారట. అదేంటన్నది రేపే తెలుస్తుంది. శుక్రవారం హిందూ సంప్రదాయ ప్రకారం, శనివారం క్రిష్టియన్ పద్దతిలో పెళ్లి చేస్తారు. శుక్ర, శని వారాల్లో అర్థరాత్రి దాటేవరకూ పార్టీ జరగబోతోంది. ఆదివారం కూడా అక్కినేని కుటుంబం ఓ పెద్ద పార్టీ ఇవ్వబోతోందని సమాచారం. ఈ పార్టీలో సినీ ప్రముఖులంతా పాలు పంచుకొంటారట. పెళ్లయ్యాక హైదరాబాద్‌లో రిసెప్షన్ ఇవ్వనున్నారు. పెళ్లికి, రిసెప్షన్‌కి రానివాళ్లంతా ఆదివారం విందులో పాలుపంచుకొంటారని తెలుస్తోంది. మరి ఎవరెవరికి ఆహ్వానాలు అందాయో.