ఈ రోజు (శుక్రవారం) గోవాలో చైతూ-సమంత పెళ్లి హిందూ సంప్రదాయ ప్రకారం జరగబోతోంది. మధ్యాహ్నం 3 గం.లకు సంగీత్ మొదలవుతుంది. రాత్రి 11గం 52 నిమిషాలకు ఈ ప్రేమ జంట పెళ్లితో ఏకం కాబోతున్నారు. రేపు (శనివారం) సాయింత్రం 5గం 30 నిమిషాలకు గోవా చర్చ్‌లో క్రైస్తవ సంప్రదాయం ప్రకారం ఉంగరాలు మార్చుకోబోతున్నారు.
మనం’లో పెళ్లి పీటలపై కూర్చుని, వెండి పళ్లెంలో ‘హాయ్’ అనే అక్షరాలతో ప్రేమ రాయబారాలు పంచుకొన్న ఈ ఇద్దరూ, ‘ఏం మాయ చేసావె’లో చర్చ్ ఫాదర్ దివ్య ప్రవచనాలు వింటూ ఉంగరాలు మార్చుకొన్న ఈ ఇద్దరూ..ఆ రెండు సీన్లనీ, ఈరోజు ఒకటి, రేపు ఒకటి చొప్పున, మరింత గ్రాండ్ గా రియల్ లైఫ్ లో రివైండ్ చేయనున్నారు. ఆ రెండు సినిమాలూ సూపర్ హిట్ అవ్వడం గమనార్హం
మొత్తానికి ఇద్దరిలో ఎవరు “ఏం మాయ చేసారో” గానీ, నిన్నటి దాకా, నువ్వు-నేను గా ఉన్న వీరు ఇవాళ్టి నుంచి “మనం” గా మారనున్నారు.