చాలా కాలం తరవాత ఏఎం రత్నం నుంచి ఓ సినిమా వస్తోంది. అదే ఆక్సిజన్. రత్నం సినిమా అంటే భారీ బడ్జెట్ చిత్రాలకు పెట్టింది పేరు. అవే ఆయనకు పేరు తీసుకొచ్చాయి. చివరికి అవే… ఆయన్ని ప్రస్తుతం లైమ్ లైట్లో లేకుండా చేశాయి. సుదీర్ఘ విరామం తరవాత ఆయనో సినిమా తీశారు.. అదే ‘ఆక్సిజన్’. ఈ సినిమా పూర్తి చేయడానికి చాలా కష్టాలు పడాల్సివచ్చింది. తనయుడ్ని దర్శకుడిగా నిలబెట్టాలన్న ఆలోచన, మళ్లీ తన బ్యానర్‌కి పూర్వ వైభవం తీసుకురావాలన్న కసి తో రత్నం ఈ సినిమా తెరకెక్కించారు. ప్రచార చిత్రాలు చూస్తుంటే రత్నం స్టైల్లోనే భారీగా ఖర్చు పెట్టినట్టు కనిపిస్తోంది.
దానికితోడు నటీనటులు, సాంకేతిక నిపుణుల జాబితా చూస్తే ఓ స్టార్ హీరో సినిమా అన్న ఫీలింగ్ కలుగుతోంది. జగపతిబాబు, శరత్‌కుమార్, శ్యామ్, చోటా కె.నాయుడు, యువన్ శంకర్ రాజా, పీటర్ హెయిన్స్…. ఇలా హేమా హేమీలున్నారు. మరి అంతా రాబట్టే సత్తా ఈ సినిమాలో ఉందా అనేదే క్వశ్చన్ మార్క్. గోపీచంద్ కి హిట్లు లేవు. మార్కెట్ బాగా డల్ అయ్యింది. ఈ సినిమాపై బజ్ కూడా పెద్దగా లేకుండా పోయింది. ట్రైలర్ చూశాక.. కొత్త ఆశలేం రేకెత్తడం లేదు. దాంతో…. ‘ఆక్సిజన్’ రిజల్ట్‌పై అనుమానాలు పెరిగిపోతున్నాయి. ”ట్రైలర్లో చూపించింది 5 శాతమే, సినిమాలో ఇంకా 95 శాతం మిగిలి వుంది” అని దర్శకుడు జ్యోతికృష్ణ ధీమాగా చెబుతున్నాడు. అదే నిజమైతే… రత్నం ఆశలు ఫలిస్తాయి.