నటి అమలాపాల్ ఇప్పుడు ఇబ్బందుల్లో పడింది. పన్ను ఎగవేత నేరంపై పోలీసులు ఆమెపై కేసు బనాయించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇటీవల బెన్స్ ఎన్ క్లాస్ అనే ఖరీదైన కారుని అమలాపాల్ కొనుగోలు చేసింది. దాని ఖరీదు దాదాపు కోటిన్నర. నియమాల ప్రకారం తన సొంత రాష్ట్రం కేరళలో పన్ను కట్టాలి. అక్కడైతే పన్ను రూపేణా రూ.25 లక్షల వరకూ చెల్లించాల్సివస్తుందని, అదే పుదుచ్చెరిలో అయితే పన్ను తక్కువ అని భావించిన అమలాపాల్, ఓ నకిలీ నివాస పత్రం సమర్పించి, కేరళలో కాకుండా పుదుచ్చెరిలో పన్ను చెల్లించింది. అయితే అమలాపాల్ కారు మాత్రం కేరళలోనే తిరుగుతోంది. ఈ విషయం పుదుచ్చెరి లెఫ్ట్ నెంట్ గవర్నర్ కిరణ్ బేడీ దృష్టికి వచ్చింది. వివరాలన్నీ పరిశీలించిన కిరణ్‌బేడీ, తక్షణం అమలాపాల్ వ్యవహారంపై దృష్టి నిలిపి, తగిన చర్చలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు. అమలాపాల్ లా.. చాలామంది సినీ ప్రముఖులు పుదుచ్చెరిలో తప్పుడు ధృవ పత్రాలు సమర్పించి, పన్ను ఎగ్గొట్టడానికి ప్రయత్నించారని తేలింది. వాళ్లందరిపైనా చర్యలు తీసుకోవడానికి అక్కడి ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది.