గరుడవేగ ఇప్పుడు టాక్ ఆఫ్ ద టౌన్. మౌత్ టాక్, రివ్యూలు బాగుండటం తో రిలీజయ్యాక కలెక్షన్స్ బాగా పెరిగాయి కానీ, రిలీజ్ కి ముందు ఈ సినిమా పడ్డ కష్టాలు అన్నీ ఇన్నీ కావు. అసలు ఒక సినిమా రిలీజ్ చేయాలంటే ఇంత జీవన్మరణ సమస్యలా ఉంటుందా అనేదానికి ఈ సినిమా కేస్ స్టడీ లా నిలిచింది. పైగా ఈ సినిమా అమ్మడానికి కష్టాలు పడటం తో పాటు జీవిత రాజశేఖర్ స్వయంగా 8 కోట్ల దాకా పెట్టుబడి పెట్టింది.
ఇక ఇప్పుడు గరుడ వేగ కు హిట్ టాక్ రావడంతో, శాటిలైట్ బేరాలు షురూ అయ్యాయి. జెమిని, జీ టీవీ రెండూ నాలుగు కోట్ల రేంజ్ లో ఆఫర్లు ఇచ్చాయని వినికిడి. కానీ నిర్మాతలు అయిదుకోట్లు అడుగుతున్నారు. అలాగే హిందీ డిజిటల్, శాటిలైట్ కు రెండున్నర కోట్ల ఆఫర్ వచ్చింది. కానీ మూడున్నర వస్తుందని చూస్తున్నారు. ఈ రెండూ అనుకున్నట్లు వస్తే, జీవిత పెట్టిన ఎనిమిది కోట్ల పెట్టుబడి వచ్చేస్తుంది. అక్కడికి నిర్మాత షేర్ నాలుగు కోట్లు, వడ్డీలు రావాలి. అవి థియేటర్లపై వచ్చెేస్తాయని ధీమా గా వున్నారు.
మొత్తానికి పెట్టిన పెట్టుబడి తిరిగి వచ్చేయడం తో పాటు రాజశేఖర్ కి చాన్నాళ్ళకి హిట్ వచ్చిందన్న ఆనందం మాత్రం జీవిత, రాజశేఖర్ ల లో స్పష్టంగా కనిపిస్తోంది.