రామ్ చరణ్ ఇష్టపడి కోలీవుడ్‌లో సూపర్ హిట్ అయిన ‘తని ఒరువన్’ రీమేక్ రైట్స్ దక్కించుకున్న సంగతి తెలిసిందే. అయితే తమిళ్ సినిమాలో విలన్ రోల్ చేశాడు ఒకప్పటి హీరో అరవింద్ స్వామీ. తెలుగు రీమేక్‌లో కూడా అతన్ని అడిగితే నో అన్నాడట. అందుకే ‘తని ఒరువన్’ తెలుగు విలన్ కోసం తెగ ట్రై చేస్తున్నారు. అయితే ఈ దారిలోనే కొద్ది రోజులు రానా పేరు వినిపించగా తాజాగా కింగ్ నాగార్జున లైన్లో ఉన్నాడని అంటున్నారు.
చరణ్ కి నాగ్ విలన్ అయ్యాడని రెండు మూడు రోజులుగా మీడియా తెగ హడావిడి చేస్తుంటే దీనికి పై స్పందించకపోతే ఇక కష్టం అనుకుని చెర్రి సినిమాలో తాను చేయట్లేదని ఇదంతా రూమర్ అంటూ క్లారిటీ ఇచ్చి రూమర్లకు చెక్ పెట్టాడు నాగ్. అయితే తెలుస్తున్న కథనాల ప్రకారం ముందు నటించాలని అనుకున్నా మరి విలన్ అంటే అక్కినేని అభిమానులు హర్ట్ అయ్యే ఛాన్స్ ఉందని కాదనుకున్నాడట నాగార్జున.
ప్రస్తుతం సోగ్గాడే చిన్నినాయనా సినిమా చేస్తున్న నాగ్ ఓ పక్క వంశీ పైడిపల్లి దర్శకత్వంలో కార్తితో కలిసి మల్టీస్టారర్ సినిమా ఊపిరిలో నటిస్తున్నాడు. నాగ్ ఇచ్చిన ఈ క్లారిటీతో అక్కినేని అభిమానులు ఫుల్ హ్యాపీ అట.