మనుషుల జీవితాలు ఎప్పుడు ముగుస్తాయో ఎవరూ చెప్పలేరు. ఏ క్షణాన ఏం జరుగుతుందో .. ఎప్పుడు ప్రాణాలు పోతాయో అంచనా వేయలేం. కానీ , చనిపోయినా కొంతమంది జీవిస్తూనే ఉంటారు. అలాంటి ఓ ఘటనే మేడ్చల్ జిల్లాలో మానవత్వానికి నిదర్శనంగా నిలిచింది.
పదహారేళ్ల అమ్మాయి ఓ పదిమందికి కొత్త జీవితాన్ని ప్రసాదించింది. చీకట్లు అలుముకున్న కుటుంబాల్లో తను దీపమైంది. విధి ఆడిన నాటకంలో తను కన్నుమూసినా ఆ పదిమంది ఇళ్ళలో కొత్త కాంతులను నింపి వెళ్లింది.
మేడ్చల్ పట్టణానికి చెందిన కూర శ్రీనివాస్ – సరిత దంపతుల చిన్న కుమార్తె దీపక(16). అకస్మాత్తుగా ఫిట్స్ వచ్చి పడిపోయింది. గమనించిన కుటుంబ సభ్యులు ఆమెను వెంటనే యశోదా ఆసుపత్రికి తరలించారు.
అనంతరం దీపికను పరీక్షించిన వైద్యులు బ్రెయిన్ డెడ్ అయినట్లు కుటుంబ సభ్యులకు తెలిపారు. దీంతో ఆసుపత్రి వైద్యులు దీపిక తల్లిదండ్రులకు అవయవదానం గురించి కౌన్సిలింగ్ ఇవ్వగా వారు అందుకు అంగీకరించారు.
దీపిక అవయవదానంతో మరో పదిమందికిప్రాణం పోసిన వైద్యులు.. బాలిక కుటుంబ సభ్యులను అభినందించారు.