తెలంగాణలో సంచలనం రేపుతోన్న ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. కేసు విచారణ జరుగుతోన్న పోలీసు స్టేషన్ ను మార్చడం సంచలనంగా మారింది.
ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణలో నిందితుడు మాజీ డీసీపీ రాదాకిషన్ రావును బంజారాహిల్స్ పోలీసు స్టేషన్ వేదికగానే విచారించారు. ఈ కేసుకు సంబంధించి పలువురు అధికారులను విచారించిన పోలీసులు విదేశాల్లో ఉన్న ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావుకు అరెస్ట్ వారెంట్ జారీ చేసి త్వరలోనే అదుపులోకి తీసుకోవడంతోపాటు ఇతర వ్యక్తులను కూడా అరెస్ట్ చేస్తారని ప్రచారం జరుగుతోంది.
వచ్చే నెలలో ప్రభాకర్ రావు హైదరాబాద్ కు వస్తారని ఇటీవల వార్తలు వచ్చాయి. ఈ క్రమంలోనే ఈ కేసు విచారణ జరుగుతోన్న పోలీసు స్టేషన్ పరిధిని మార్చేశారు. బంజారాహిల్స్ పోలీసు స్టేషన్ నుంచి జూబ్లిహిల్స్ పోలీసు స్టేషన్ కు మార్చారు. ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు అనేది క్లారిటీ లేదు కానీ కేసు కీలక దశలో ఉండగా, విచారణ జరుగుతోన్న పోలీసు స్టేషన్ పరిధిని మార్చడం చర్చనీయాంశం అవుతోంది.