ఆంధ్రజ్యోతి ఆర్కే.. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లోనే కాదు.. సోషల్ మీడియాలో కూడా ఎక్కడ చూసినా ఆయన పేరే హైలెట్ అవుతోంది. సీఎం జగన్ విజయ్ కుమార్ స్వామి అనే వ్యక్తిని పిలిపించుకుని ఐదారుగంటల పాటు మాట్లాడిన విషయాన్ని ఆయన లాబీయింగ్ కోసమే వచ్చారన్న విషయాన్ని బయట పెట్టడం సంచలనం అయింది. దీన్ని ఖండించడానికి కూడా లేకుండాపోయింది. వచ్చిన ప్రత్యేక విమానం… డాటా బయటకు వచ్చింది. విజయ్ కుమార్ స్వామికి కేటాయించిన పైలట్ వాహనం దృశ్యాలు కూడా వెలుగులోకి వచ్చాయి. దీంతో వైవీ సుబ్బారెడ్డి ప్రెస్ మీట్ పెట్టి ఆశీర్వాదం ఇవ్వడానికే వచ్చారన్నారు.
ఆంధ్రజ్యోతి ఆర్కే చాలా స్పష్టంంగా విజయ్ కుమార్ వ్యవహారాలను బయట పెట్టింది. ఇది ఎంత ఎఫెక్ట్ అనేది సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని బట్టి అర్థమైపోతుంది. ఇటీవలి కాలంలో ఆర్కే ఫుల్ ఫామ్ లో ఉన్నారు. ఏపీ ప్రభుత్వ అంతర్గత విషయాలను చాలా సులువుగా తెలుసుకుంటున్నారు. ముఖ్యంగా వైఎస్ కుటుంబ వ్యవహారాల విషయంలో ఆయన దూకుడుగా ఉన్నారు. అన్ని విషయాలు బయట పెడుతున్నారు.
సీఎం జగన్ కూడా ఆంధ్రజ్యోతి రేపు ఎం రాస్తుందోనని నిద్రపోకుండా ఎదుుర చూసే పరిస్థితులు ఏర్పడ్డాయని వైసీపీ నేతలే సెటైర్లు వేసుకుంటున్నారు. ఓ వైపు తమపై వ్యతిరేక కథనాల జోరు పెంచిందని ఈనాడు, మార్గదర్శిని టార్గెట్ చేసినా అవి తగ్గడం లేదు. కానీ ఈనాడు ఇలాంటి గాసిప్ పాలిటిక్స్ రాయదు. కళ్ల ముందు కనిపించే నిజాల్ని మాత్రమే రాస్తుంది. కానీ గాసిప్స్ రాసి వాటిని నిజం అని నిరూపిస్తుంది ఆంధ్రజ్యోతి.
ప్రతి శనివారం రాత్రి కొత్తపలుకులో ఏం చెబుతారో అనే దాని కన్నా ఇప్పుడు పత్రికల్లో ఏం గుట్టు ఆర్కే బయటపెడతారోనని వైసీపీ వాళ్లు టెన్షన్ పడుతున్నారు.