బెంగుళూరు రేవ్ పార్టీ కొత్త మలుపు తీసుకుంది. రేవ్ పార్టీలో డ్రగ్స్ వాడినట్లు గుర్తించిన పోలీసులు… నార్కోటిక్ పరీక్షలు చేయిస్తున్నారు. ఇందులో ఏపీకి చెందిన వారే ఎక్కువగా పట్టుబడ్డట్లు తెలుస్తుండగా, ఓ మంత్రికి చెందిన ఎమ్మెల్యే స్టిక్కర్ దొరకటం చర్చనీయాంశం అవుతుంది.
అయితే, ఈ రేవ్ పార్టీలో సినీ నటి హేమ ఉన్నట్లు వార్తలొచ్చాయి. అయితే, తాను హైదరాబాద్ లో ఉన్నానని.. తనకు బెంగుళూరు రేవ్ పార్టీతో సంబంధం లేదని ఉదయం హేమ వీడియో రిలీజ్ చేశారు.
కానీ, బెంగుళూరు పోలీసులు మాత్రం హేమ రేవ్ పార్టీలో పాల్గొన్నారని తన ఫోటో కూడా రిలీజ్ చేశారు. అంతేకాదు, హేమ రికార్డ్ చేసిన వీడియో కూడా రేవ్ పార్టీ జరిగిన ఫాంహౌజ్ లో రికార్డ్ చేసిందేనన్నారు. హేమ రికార్డ్ చేసిన వీడియోలో ఉన్న డ్రెస్, పోలీసులు రిలీజ్ చేసిన ఫోటోలో ఉన్న డ్రెస్ ఒక్కటే కావటం విశేషం.
కేసు నుండి బయటపడేందుకే హేమ… వీడియో విడుదల చేశారని, కానీ పోలీసుల దెబ్బకు అడ్డంగా బుక్కయ్యారన్న విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
అయితే, ఈ బెంగుళూరు ఫాంహౌజ్ రేవ్ పార్టీ వెనుక ఉన్నది ఎవరన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.