అదానీ ఎవరు ప్రపంచ ధనవంతుల్లో ఒకరు. ఆయన ఏం చేస్తున్నారు.. ఏపీలో ఇసుక కోసం టెండర్ వేశాడు. వినడానికి చిత్రంగా ఉన్నా ఆయన కక్కుర్తి ఈ స్థాయికి దిగజారిపోయిందా .. అని అందరూ ఆశ్చర్యపోవాల్సిందే. ఏపీలో ఇసుకను దోచుకోవడానికి కొత్త కొత్త మార్గాల్లో ప్రయత్నిస్తున్న ప్రభుత్వం కలకత్తాలో టెండర్లు ఖరారు చేసింది. ఎవరు టెండర్లు వేశారు.. ఎవరికి ఖరారు చేశారు అన్నది ఎవరికీ తెలియదు. కానీ నిన్నటి నుంచి ముఖ్యమంత్రి కార్యాలయం చెప్పిందని.. ఇసుక తవ్వకాలు ప్రారంభించేశారు.
కానీ అదానీ పేరుతో ఇసుక టెండర్లు వేశారని.. ఆయనకే ఖరారయ్యాయని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. పేరుకు అదానీ కంపెనీని ఉపయోగించుకుని ఆయనకు కమిషన్ ఇచ్చి సబ్ కాంట్రాక్టుల పేరుతో జగన్ రెడ్డి సోదరుడు అనిల్ రెడ్డి ఈ ఇసుక వ్యాపారాన్ని కైవసం చేసుకుంటున్నారన్న ప్రచారం జరుగుతోంది. మొదటి నుంచి ఆయనకే ఈ ఇసుకను పిండుకునే అవకాశం కల్పిస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది.అందుకోం రకరకాల విన్యాసాలు చేస్తున్నారు.
అాదానీకి ఏపీ సహజ వనరులు పెద్ద కల్పవృక్షంలాగా మారింది. పోర్టులు, రోడ్లు, విద్యుత్ ప్రాజెక్టులు చివరికి ఇసుక కూడా ఆయన చేతికే చేరుతోంది. ఓ వైపు గాలి బుడగల్లాంటి కంపెనీలతో బ్లాక్ మనీని వైట్ మనీగా మారుస్తూ.. పెద్ద ఎత్తున దేశంలోకి పెట్టుబడుల ప్రవాహం చేస్తున్నారని తీవ్రమైన ఆరోపణలు వస్తున్న సమయంలో అదానీ గ్రూప్ ఇలా ఎపీలో ప్రతీ దందాలోనూ పాలు పంచుకోవడం.. దానికి జగన్ రెడ్డి సాయం చేయడం ఆసక్తిగా మారింది.,
జగన్ రెడ్డిని కలిసేందుకు అదానీ… తరచూ తాడేపల్లికి సీక్రెట్ గా వచ్చి పోతూంటారు. ఆయన పెట్టే పెట్టుబడుల సంగతేమో కానీ ఏపీ మొత్తం అదానీ ప్రదేశ్ గా మారిపోతున్న సూచనలు మాత్రం కనిపిస్తున్నాయన్న ఆందోళన వ్యక్తమవుతోంది.