వెండి తెరపై ముఖ్యమంత్రుల జోరు ఎక్కువగానే కనిపిస్తోంది. ‘నేనే రాజు నేనే మంత్రి’లో రానాని సీఎం సీటు పై కూర్చోబెట్టాడు తేజ. ‘భరత్ అను నేను’ కోసం మహేష్ బాబు కూడా ముఖ్యమంత్రి కాబోతున్నాడు. ఇప్పుడు శేఖర్ కమ్ముల కూడా ‘సీఎం’ కథ రాసుకోవడంలో బిజీగా ఉన్నాడట. లీడర్` సినిమాలో ఆయన కూడా రానాని ముఖ్యమంత్రిని చేసేశారు. ఈసారి మాత్రం డిఫరెంట్ కథని ఎంచుకొన్నాడట. ఓ సామాన్యుడు సీఎం ఎలా అయ్యాడన్నది అతని కాన్సెప్ట్. గవర్నమెంట్ స్కూల్లో చదువుకొన్న ఓ కుర్రాడు.. ఈ వ్యవస్థని మార్చాలన్న ఉద్దేశంతో ముందడుగు వేస్తాడు. ఒక్కో మెట్టూ ఎక్కి పైకి వెళ్తాడు. చివరికి సీఎం అవుతాడు. ఆ ప్రహసనం ఎలా సాగిందన్నదే ఈ సినిమా కథ అని తెలుస్తోంది. ‘నేనే రాజు నేనే మంత్రి’ స్టోరీ లైన్ కూడా ఇంతే. కాకపోతే.. శేఖర్ కమ్ముల కథలు రియాలిటీకి దగ్గరగా ఉంటాయి. ఓ స్ట్రాంగ్ మెసేజ్ కూడా ఇస్తాడు. ‘లీడర్’ ముఖ్యమంత్రి కథే గానీ, జనాలకు అంతగా చేరువ కాలేదు. ఈసారి ఆలోటు తీరుస్తాడేమో చూడాలి. ప్రస్తుతం స్క్రిప్టు వర్క్‌తో బిజీగా ఉన్నాడు శేఖర్ కమ్ముల. 2018 ప్రారంభంలోనే ఈ సినిమా పట్టాలెక్కొచ్చు.