అగ్రిగోల్డ్ బాధితుల ఆర్తనాదాలు ఇంకా వినిపిస్తూనే ఉన్నాయి. ఆ సంస్థ ఆస్తలను అమ్ముకుంటానని అనుమతి ఇవ్వాలని అగ్రిగోల్డ్ ఓనర్ అవ్వాస్ వెంకటరామారావు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ అంశం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తనకు ఆస్తలును అమ్ముకునే అవకాశం ఇస్తే.. ఏడాదిలో ఆరున్నర వేల కోట్లు డిపాజిట్ చేస్తానని ఆయన చెబుతున్నారు. నిజానికి ఆ ఆస్తులను అమ్మి డిపాజిట్లకు చెల్లించడానికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. ఏదో ఓ అడ్డంకి వస్తూనే ఉంది. ప్రభుత్వం కూడా పూర్తి స్థాయిలో దృష్టి పెట్టలేదు.
ఇప్పుడు ఏకంగా ఓనరే కోర్టులో పిటిషన్ వేసి ఆస్తులను అమ్ముకుంటానని చెబుతున్నారు. దీని వెనుక పెద్ద కుట్ర ఉందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బ్యాంకులకు డబ్బులు ఎగ్గొట్టి లండన్ పారిపోయిన విజయ్ మాల్యా కూడా ఇలాంటి పిటిషనే కోర్టుల్ో వేశారు. బ్యాంకులు , దర్యాప్తు సంస్థలు జప్తు చేసిన తన ఆస్తుల్ని విడిపిస్తే.. చెల్లించాల్సినవన్నీ చెల్లిస్తానని చెప్పుకున్నారు. కానీ ఆయనకు సానుకూల నిర్ణయం రాలేదు. ఇప్పుడు అగ్రిగోల్డ్ ఓనర్ కూడా అదే చేస్తున్నారు.
అగ్రిగోల్డ్ ఓనర్ పిటిషన్ కు కోర్టు అనుమతి ఇస్తే.. ఆస్తులన్నీ ఆయనకు అప్పగించాల్సి ఉంటుంది.అప్పుడు ఆయన అమ్ముకుంటారు. ఆ తర్వాత డబ్బులు కడతారా లేదా అన్నది ఎవరికీ తెలియదు. అమ్మితే అంత పెద్ద మొత్తం రాలేదని.. లేకపోతే మరొకటని చెప్పి వ్యవస్థలతో ఆడుకోవచ్చు. ఇన్ని లక్షల మందిని నమ్మించి మోసం చేసిన వ్యక్తి.. మరోసారి కోర్టుల్ని మోసం చేయరని రూల్ ఏమీ లేదు కదా అనే అనుమానాలున్నాయి.
జగన్ తాను అధికారంలోకి రాగానే అగ్రిగోల్డ్ బాధితులకు 1100కోట్లు ఇస్తానని హమీ ఇచ్చారు. నాలుగేళ్లు దాటినా పైసా ఇవ్వలేదు. చివరి ఏడాది ఆస్తులన్నీ అగ్రిగోల్డ్ ఖాతాకే వెళ్లిపోయేలా పరిస్థితులు మారుతున్నాయి. బాధితులు మాత్రం ఆక్రందనల్లో ఉన్నారు.