పుల్వామా ఉగ్రవాద దాడిలో… ఓ వైపు అమర జవాన్లకు… కన్నీటి వీడ్కోలు దేశం పలుకుతూనే ఉంది. పాకిస్థాన్‌పై ప్రతీకారం తీర్చుకోవాలనే డిమాండ్ .. దేశం నలుమూలల నుంచి వస్తోంది. దీనిపై అన్ని పార్టీలతో చర్చించి నిర్ణయం తీసుకోవడానికి… కేంద్ర ప్రభుత్వం ఓ అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసింది. దీనికి హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షత వహించారు. ఓ దేశంలో విధానపరమైన నిర్ణయం తీసుకోవడానికి అన్ని పార్టీలతో ఏర్పాటు చేసిన సమావేశానికి ప్రధాని రాలేదు. అంత కంటే.. ముఖ్యమైన పని ఏమైనా ఉందా.. అంటే… ఆయన… ఆ సమయానికి మహారాష్ట్రలో ఏర్పాటు చేసిన ఓ ఎన్నికల ప్రచారసభలో ప్రసంగిస్తున్నారు. ప్రజల కడుపు రగిలిపోతోందని.. రక్తం మరిగిపోతోందని… తనకూ అలాగే ఉందని.. పాకిస్తాన్‌కు దెబ్బకు దెబ్బ తీస్తామని.. ఆయన ఎన్నికల ప్రచార సభల్లో… ఆవేశ పడిపోతున్నారు.
వీర జవాన్లకు.. నివాళి అర్పించాలని… ఆయన తన పార్టీ నేతలందర్నీ ఆదేశించారు. ఎక్కడ… అమర జవాన్ అంత్యక్రియలు జరిగినా.. అక్కడకు వెళ్లాలని.. ఎంపీలను ఆదేశించారు. ఓ వైపు దేశం మొత్తం.. పాకిస్తాన్ ఉగ్రదాడిపై చర్చ జరుగుతూండగానే… ప్రధాని మోడీ మాత్రం… ఎన్నికల ప్రచార సభల షెడ్యూల్‌ను ఏ మాత్రం… మార్పు చేసుకోలేదు. కీలకమైన… సమావేశాలు, దేశభద్రతకు చెందిన అంశాలను కూడా పక్కన పెట్టేసి.. ఆయన ప్రచారసభలకు పరుగులు పెడుతున్నారు. ఆ ప్రచారసభల్లో మాత్రం.. తనకు మాత్రమే సాధ్యమైన.. నాటకీయతను జోడించి.. పాకిస్థాన్‌పై నిప్పులు చెరుగుతున్నారు.
కేంద్ర ప్రభుత్వ తీరు.. తీవ్ర స్థాయిలో వివాదాస్పదమవుతోంది. అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే చోట.. కొన్ని వందల కిలోల పేలుడు పదార్ధాలను ఎలా సమీకరించగలిగారు.. ఎలా.. సైనికుల కాన్వాయ్ లోకి తీసుకు రాగలిగారు.. ఎన్ఐఏ, రా వంటి ఏజెన్సీలు ఏం చేస్తున్నాయన్న ప్రశ్నలు ఇప్పుడిప్పుడే వస్తున్నాయి. అయితే.. ఇలాంటి ప్రశ్నలు రానీయకుండా… అలా ప్రశ్నిస్తే.. వీరి దేశభక్తిని శంకించాల్సిందేనన్నట్లుగా.. బీజేపీ నేతలు వ్యవహరించడం ప్రారంభించారు. దీంతో రాజకీయ పార్టీలు సంయమనం పాటిస్తున్నాయి. కానీ బీజేపీ.. ఇప్పుడు దేశ ప్రయోజనాలను కాకుండా.. బీజేపీ ప్రయోజనాలను పట్టించుకుని పాకిస్థాన్‌తో వ్యవహారాలను డీల్ చేస్తుందన్న అభిప్రాయం… అంతటా ఏర్పడుతోంది. దీనికి మోడీ ..ఎన్నికల ప్రచారసభల్లో చేస్తున్న హంగామానే సాక్ష్యంగా కనిపిస్తోంది.