బెంగళూరుకు అతి సమీపంలో ఉన్న అనంతపురం జిల్లా రాత పూర్తి స్థాయిలో మారిపోయే అవకాశాలు ఉన్నాయి. కియా ప్లాంట్ వచ్చిన తర్వాత అంతర్జాతీయ సంస్థలు ఇప్పుడు ఏపీ వైపు చూస్తున్నాయి. గత ఐదేళ్ల విధ్వంసం తర్వాత మరోసారి ప్రజలు అలాంటి పరిస్థితి రానివ్వబోమని భరోసా ఇస్తూ ఇచ్చిన తీర్పుతో మరోసారి గత ప్రతిపాదనలు తెరపైకి వస్తున్నయి. తాజాగా ఎయిర్ బస్ సంస్థ అనంతపురంలో హెలికాఫ్టర్ అసెంబ్లింగ్ యూనిట్ పెట్టేందుకు ఆసక్తి చూపిస్తోంది.
ఫ్రాన్స్‌కు చెందిన ఎయిర్‌బస్ సంస్థ భారతదేశంలో హెచ్125 హెలికాప్టర్ల కోసం ఫైనల్ అసెంబ్లీ లైన్ ప్లాంట్ ఏర్పాటుకు నిర్ణయించింది. ఈ ఎనిమది ప్రదేశాల్లో పరిశీలన చేస్తున్నారు. ఈ ఎనిమిదింటిలో ఏపీ కూడా ఉంది. త్వరలో ఒక దాన్ని ఎంపిక చేసుకుంటామని ఎయిర్ బస్ ప్రకటించింది. ఎంపిక చేసిన చోట ప్లాంట్ ఏర్పాటుకు ఈ ఏడాది ఆఖర్లో భూమి పూజ నిర్వహించనున్నారు. 2026 నుంచి కార్యకలాపాలను ప్రారంభించాలని ఎయిర్‌బస్ లక్ష్యంగా పెట్టుకుంది.
Also Read : న్యూ ఫార్మా హబ్‌గా కాకినాడ
ఇప్పుడు ఎయిర్ బస్ ఎనిమిది చోట్ల పరిశీలన జరుపుతోంది కానీ… గతంలోనే ఈ విషయంలో ఏపీతో చర్చలు జరిపింది. 2015-16 మధ్య కాలంలో ఉమ్మడి అనంతపురం జిల్లా గోరంట్ల మండలం పాలసముద్రం దగ్గర ఎయిర్‌బస్ ప్లాంట్ ఏర్పాటు కోసం ప్రభుత్వంతో చర్చలు జరిగాయి. పాలసముద్రం వద్ద 250 ఎకరాల భూమిని కేటాయించేందుకు ప్రభుత్వం కూడా సిద్ధమైంది. అయితే ఈ ప్రతిపాదనలు కార్యరూపం దాల్చలేదు. అయితే ఇప్పుడు ఫైనల్ అసెంబ్లీ లైన్ ఏర్పాటు కోసం ఎయిర్‌బస్ ఎనిమిది ప్రాంతాలను ఎంపిక చేయటంతో ఏపీ ప్రభుత్వం మరోసారి అప్రమత్తమయింది.
అనంతపురానికి 80 కిలోమీటర్లు, కర్ణాటక రాజధాని బెంగళూరుకు 90 కిలోమీటర్ల దూరంలో ఉన్న పాలసముద్రం వద్ద భూమిని ఇచ్చేందుకు అప్పటి టీడీపీ ప్రభుత్వం సిద్ధమైంది. బెంగళూరు విమానాశ్రయానికి సమీపంలో ఈ ప్రాంతం ఉండటం.. ఎక్కువగా ప్రభుత్వ భూమి అందుబాటులో ఉండటంతో పారిశ్రామిక ఫ్రెండ్లీ విధానంతో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ప్రభుత్వం రెడీగా ఉండటంతో ప్లాంట్ పెట్టేందుకు ఎయిర్ బస్ ఏపీ వైపే మొగ్గే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు.