అమెరికా అధ్యక్షుడు ఎప్పుడైనా ఇండియాకు వస్తే ఆయన వచ్చే విమానం గురించి మీడియా కథలు కథలుగా చెబుతుంది. అది ఎగిరే వైట్ హౌస్ అని.. గాల్లోనే ఇంధనం నింపుకుంటుందని.. ఎలాంటి దాడులకూ చిక్కదని.. అందులో బంగారం టాయిలెట్లు ఉంటాయని ఇలా విశేషాలకు కొదవ లేకుండా చెప్పుకుంటారు. ఇప్పుడు భారత ప్రధాని మోడీ విమానం గురించి కూడా అలా చెప్పుకోవాల్సిందే. ఎందుకంటే.. అలాంటిదే ఓ విమానాన్ని అమెరికాలో తయారు చేయించుకున్నారు. అది ఇండియాకు వచ్చేసింది కూడా.
భారత ప్రధాని పర్యటించేందుకు ఎయిరిండియా విమానాలున్నాయి. అయితే అవి ప్రత్యేకమైనవి కావు. ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్రమోజీ బోయింగ్ 777-300 ఈఆర్ విమానాలను చేయించారు. అమెరికా అధ్యక్షుడు ప్రయాణించే ఎయిర్ ఫోర్స్ వన్‌కు ధీటుగా విలక్షణ రక్షణ సదుపాయాలు ఉన్నాయి. మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ పాటు శక్తిమంతమైన ఈడబ్ల్యూ జామర్, మిర్రర్ బాల్ ఈక్వలెంట్ సిస్టం, క్షిపణి హెచ్చరిక వ్యవస్థ వంటి ఎన్నో సదుపాయాలున్నాయి. దీన్ని నడిపేది. భారత వైమానిక దళానికి చెందిన నిపుణులు. అమెరికాలోని డల్లాస్‌లో బోయింగ్ తయారీ కేంద్రాల్లో తయారైన ఈ విమానాలకు ఆధునిక సైనిక రక్షణ వ్యవస్థలు, ప్రత్యేకంగా క్యాబిన్లో మార్పులు చేసి పునర్నిర్మించారు.
గంటకు 900 కిలోమీటర్లు వేగంతో పయనించగల రెండు జీఈ90-115 ఇంజిన్లు ఉంటాయి.- గాల్లోనే ఇంధనం నింపుకునే సదుపాయం కూడా ఉంది. దీంతో ప్రయాణం మధ్యలో ఇంధనం కోసం కిందికి దిగాల్సిన అవసరం లేదు. భద్రత కోసం భారత్ ఈ విమానాల్లో దేశీయ మిలటరీ రక్షణ వ్యవస్థలను పొందుపర్చుతోంది. ప్రయాణంలో ఉండగా దురదృష్టవశాత్తూ ఏదైనా ప్రమాదం జరిగితే కొన్ని ప్రత్యేకమైన వ్యవస్థలు విమానాన్ని కాపాడగలవు. అమెరికా అధ్యక్షుడు ఉపయోగిస్తున్న ఎయిర్‌ఫోర్స్ వన్ తర్వాత ఆ తరహాలో రూపుదిద్దుకున్న శత్రుదుర్బేధ్య విమానం ఎయిరిండియా వన్ నే. ఈ విమానాల్లో అత్యాధునిక ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సూట్లు కూడా ఉన్నాయి. దీంతో ఏదైనా దాడులు జరిగినప్పుడు వెనుదిరగకుండా.. ఎలాంటి దాడులనైనా తిప్పికొట్టగలదు. మొత్తానికి మోదీ ట్రంప్ స్థాయికి చేరుకుంటున్నారని అనుకోవచ్చు.