మెహబూబాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు పూరి తనయుడు ఆకాష్. ఇప్పుడు మరోసారి హీరోయిజం చూపించడానికి రెడీ అయ్యాడు. ఆకాష్ కథానాయకుడిగా అనిల్ పాడూరి దర్శకత్వంలో ఓ చిత్రం మొదలైంది. దీనికి `రొమాంటిక్` అనే పేరు పెట్టారు. ఈరోజు ఉదయం హైదరాబాద్లో ఈ చిత్రం లాంఛనంగా మొదలైంది. ఈ చిత్రానికి పూరి కథ, మాటలు, స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. పూరీనే నిర్మాత కూడా. `మెహబూబా` తరవాత పూరి దర్శకత్వంలోనే ఆకాష్ సినిమా మొదలవ్వాల్సివుంది. కానీ… `ఇస్మార్ట్ శంకర్` వల్ల.. పూరి దర్శకత్వ బాధ్యత తీసుకోలేకపోయాడు. ఇప్పుడు ఆ చిత్రాన్ని మరో యువ దర్శకుడి చేతుల్లో పెట్టాడన్నమాట. అటు `ఇస్మార్ట్ శంకర్`, ఇటు `రొమాంటిక్` రెండు చిత్రాలకీ పూరీనే పెట్టుబడి పెడుతున్నాడు. అసలే పూరి చాలా క్లిష్టపరిస్థితుల్లో ఉన్నాడు. ఒకేసారి రెండు సినిమాలు భుజాలపై వేసుకున్నాడు. ఏం జరుగుతుందో చూడాలి.