అఖిల్ ఏజెంట్ డిజాస్టర్ అయ్యింది. భారీ అంచనాల మధ్య గత నెలాఖరులో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈసినిమా దారుణమైన పరాజయాన్ని చూసింది. ఈ క్రమంలోనే నిర్మాత అనిల్ సుంకర .. కొన్నిరోజుల క్రితం అపజయం వివరణ ఇచ్చారు. ‘ఏజెంట్’ ఫలితం విషయంలో పూర్తి బాధ్యత తమదే అని , స్క్రిప్టు పక్కాగా సిద్ధంకాకముందే చిత్రాన్ని ప్రారంభించడం బ్లండర్ మిస్టేక్ అని చెప్పుకొచ్చారు.
తాజాగా అఖిల్ కూడా వివరణ ఇచ్చాడు. ‘ఏజెంట్’యూనిట్ అందరికీ థాంక్స్ . ఎంతో కష్టపడినప్పటికీ దురదృష్టవశాత్తు మేము అనుకున్నదాన్ని స్క్రీన్‌పైకి తీసుకురాలేకపోయాం. ఈ ప్రయాణంలో నాకెంతో అండగా నిలిచిన చిత్ర నిర్మాత అనిల్‌కు కృతజ్ఞతలు. మా చిత్రాన్ని నమ్మిన డిస్ట్రిబ్యూటర్లు, సపోర్ట్ చేసిన మీడియాకు ధన్యవాదాలు. అభిమానులు, శ్రేయోభిలాషులు ఇస్తున్న ప్రేమ వల్లే నేను కష్టపడి వర్క్ చేస్తున్నా. నాపై నమ్మకం పెట్టుకున్న వారి కోసం మరింత స్ట్రాంగ్ గా సిద్ధమై మళ్లీ వస్తాను’’ అని చెప్పుకొచ్చాడు అఖిల్.
అయితే నిర్మాత వివరణ లో దర్శకుడు సురేందర్ ని కార్నర్ చేస్తూ ‘బౌండెడ్ స్క్రిప్ట్’ కామెంట్ వినిపించింది. అఖిల్ మాత్రం అసలు దర్శకుడి ప్రస్తావనే లేకుండా జాగ్రత్తపడటం గమనార్హం.