దీపావళి కానుకగా కేంద్రం పెట్రోలుపై రూ. ఐదు, డీజిల్‌పై రూ. పది తగ్గించి .. రాష్ట్రాలు కూడా కొంత మేర తగ్గించాలని సూచించింది. కేంద్ర సూచన మేరకు రాష్ట్ర ప్రభుత్వాలు పెద్ద ఎత్తున పెట్రో రేట్లను తగ్గిస్తూ నిర్ణయం తీసుకంటున్నాయి. ఒక్కో రాష్ట్రం గరిష్టంగా ఏడు రూపాయలు కూడా తగ్గించాయి. అతి పెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశ్‌లో కేంద్రం ప్రకటించిన తగ్గింపుతో కలిసి రూ. పన్నెండు తగ్గిస్తున్నట్లుగా ప్రకటించింది. అంటే పెట్రోల్‌పై రూ. ఏడు. డిజిల్‌పై రూ. రెండు అదనంగా తగ్గిచారు. అసోంలో రాష్ట్రం విధిస్తున్న పన్నుల్లో రూ. ఏడు తగ్గింపునుప్రకటించారు అక్కడి సీఎం.
గుజరాత్, త్రిపుర కర్ణాటక, గోవా, మణిపూర్ ప్రభుత్వాలు కూడా పై రూ.7 తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. బీహార్ ప్రభుత్వం రూపాయి 30 పైసలు తగ్గించింది. ఉత్తరాఖండ్ ప్రభుత్వం లీటర్ పెట్రోల్‌పై రూ.2 తగ్గించింది. హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం కూడా తగ్గిస్తామని ప్రకటించింది. ఒడిషా సర్కార్ రూ. మూడు అదనంగా తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు మాత్రం ఇంత వరకూ ఎలాంటి ప్రకటన చేయలేదు. చేసే ఆలోచన ఉందో లేదో కూడా స్పష్టత లేదు.
కానీ విపక్ష పార్టీలు మాత్రం ప్రశ్నించడం ప్రారంభించాయి. కర్ణాటక పెట్రోల్‌పై రూ. ఏడు తగ్గిస్తే మొత్తం కేంద్రం ఇచ్చిన తగ్గింపుతో కలిసి రూ. పన్నెండు తగ్గుతుంది. అంతకు ముందు ఏపీతో పోలిస్తే రూ. ఐదు వరకు తగ్గువ ఉంది. అంటే కర్ణాటకలో ఏపీ కన్నా రూ. పదిహేడు రూపాయల తక్కువగా పెట్రోల్ దొరుకుతుందన్నమాట. ఎలా చూసినా ప్రభుత్వాలు స్పందించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. లేకపోతే ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేసే అవకాశం ఉంది.