మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తాను అలిగానని హైకమాండ్‌కు సంకేతాలు పంపారు. అది ఎలా అంటే కొన్ని మీడియాలకు లీకులు ఇవ్వడం ద్వారా. తాను పార్టీపై అసంతృప్తిగా ఉన్నానని.. దానికి కారణాలంటూ కొన్ని పాయింట్లను ఆయన అనుచరులు మీడియాకు ఇచ్చారు. అవేమిటంటే మంత్రి పదవి ఇవ్వకపోవడం.. గంజి చిరంజీవిని పార్టీలో చేర్చుకుని పదవి ఇవ్వడం… వచ్చే ఎన్నికల్లో ఆయనే పోటీ చేస్తారని చెప్పడం.. అసలు పార్టీలో ప్రాధాన్యం ఇవ్వకపోవడం .. ఇలాంటివి చెప్పుకొచ్చారు. ఈ ప్రచారానికి తగ్గట్లే ఆయన ఎమ్మెల్యేల సమావేశానికి కూడా వెళ్లలేదు.
నిజానికి ఆర్కే ను జగన్ ఇప్పుడు కాదు ఎప్పుడూ పట్టించుకోలేదు. కానీ వైసీపీని నడిపే అతి కొద్ది కీలకమైన రెడ్లలో ఆళ్ల అయోధ్య రామిరెడ్డి ఒకరు. ఆయన సోదరుడు ఈ ఆర్కే. అందుకే టిక్కెట్లు కేటాయిస్తూ వస్తున్నారు. ఈ సారి మంగళగిరిలో ఆర్కే ఓడిపోవడం ఖాయం కావడంతో కుల ప్రాతిపదికిన చేనేత అభ్యర్తిని నిలబెట్టాలని అనుకుంటున్నారు. టీడీపీ నుంచి పోటీ చేసిన గంజి చిరంజీవిని పార్టీలో చేర్చుకున్నారు.
ఇప్పుడు ఆర్కేకు భయం పట్టుకుందని చెబుతున్నారు. తాను చేసినపనులకు.. టీడీపీ అధికారంలోకి వస్తే వదిలి పెట్టరని.. ఆయన కంగారు పడుతున్నారని అంటున్నారు. అందుకే పార్టీపై అసంతృప్తి పేరుతో మీడియాకు సమాచారం ఇస్తున్నారని.. ఎవరైనా సంప్రదిస్తే.. దాన్ని టాంటాం చేసుకోవచ్చని అనుకుంటున్నారు. అయితే ఆర్కేను ఎవరైనా ఇతర పార్టీల్లోకి రమ్మని పిలుస్తారా అనే సెటైర్లు వినిపిస్తున్నాయి. ఆయన ఉంటే వైసీపీలో ఉండాలి లేకపోతే… రిటైర్మెంట్ తీసుకోవాలని.. వేరే పార్టీల్లోకి రానివ్వరని అంటున్నారు. మొత్తానికి తాను బుంగమూతిపెట్టానని జగన్‌కు ఆర్కే సంకేతాలు పంపారు. మరి జగన్ పట్టించుకుంటారో లేదో మరి !