ఔను రేసుగుర్రం రాజీపడింది. అదేనండి రేసుగుర్రం హీరో అల్లు వారబ్బాయి అల్లు అర్జున్ రాజీపడ్డాడు. ఏదో ఫైట్ సీన్ లోనో, డాన్స్ లోనో కాదు. ఓ కేసు విషయంలో రాజీపడ్డాడు. ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉన్న కేసును పరిష్కరించుకోవడానికి అవతలి పార్టీతో రాజీకుదుర్చుకున్నాడు.
2004లో హైదరాబాద్ శివారులో ఉన్న నార్సింగి దగ్గర 14 ఎకరాలు అల్లు అర్జున్ కుటుంబం కొనుగోలు చేసింది. అయితే.. అంతకు ముందు ఓనర్ 10 ఎకరాలు కొని.. పక్కనే ఉన్న మరో నాలుగు ఎకరాలను కూడా కలిపి అమ్మేశాడు. అయితే అలా ఎలా కొంటారంటూ పక్కనే ఉన్న ఓనర్ రాహుల్ దేవ్ 2009లో క్రిమినల్ కేసు వేశాడు. ఇది అప్పటి నుంచి వాయిదాలు పడుతూ వస్తోంది.
చాలా రోజుల నుంచి వాయిదాల మీద తిరుగుతూ వస్తున్న వారు ఇవాళ రంగారెడ్డి జిల్లా కోర్టులో రాజీ పడ్డారు. అల్లు అర్జున్, కుటుంబసభ్యులు, కేసు వేసిన రాహుల్ దేవ్ (ఆయన అడ్వకేట్ కూడా) మధ్య ఒప్పందం కుదిరింది. లోక్ అదాలత్ లో కూర్చుని సెటిల్ చేసుకున్నారు. అయితే ఆ సెటిల్మెంట్ సారాంశం ఏంటనేది సస్పెన్స్.