బిజినెస్ విషయంలో దిల్ రాజు తెలివితేటల్ని తక్కువ చేయడానికి వీల్లేదు. సినిమా ఎలాగున్నా సరే – `లాభసాటి` వ్యాపారం చేసుకోవడంలో రాజు గారు దిట్టే. `డీజే` వ్యాపారం చూస్తే ఈ విషయం అర్థమైపోతుంది. శాటిలైట్‌తో కలిపి దాదాపుగా రూ.80 కోట్ల బిజినెస్ చేయబోతున్నాడట దిల్‌రాజు. `సరైనోడు` సూపర్ హిట్ అవ్వడం.. దిల్‌రాజుకి పరోక్షంగా కలిసొచ్చింది. ఆ సినిమా దాదాపుగా రూ.70 కోట్లు సాధించింది. దాంతో రూ.80 కోట్ల బిజినెస్ చేయగలుగుతున్నాడు దిల్‌రాజు. తన సొంత సినిమాల్ని ఓన్ గా రిలీజ్ చేసుకొనే దిల్‌రాజు ఈ సారి కొన్ని ఏరియాలు గీతా ఆర్ట్స్ చేతిలో పెట్టాడు. మరికొన్ని ఏరియాలు హాట్ కేకుల్లా అమ్మేశాడు. రిలీజ్‌కి ముందు ఎంతకాదన్నా రూ.20 కోట్ల టేబుల్ ప్రాఫిట్ చూసే ఛాన్సుందట. ఆ లెక్కన… విడుదలకు ముందే.. డీజే సూపర్ డూపర్ హిట్ అయినట్టే లెక్క. కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ సినిమా కాబట్టి… క్లిక్కయితే పెట్టుబడికి ఢోకా ఉండదు. అదే బయ్యర్ల ధీమా. పైగా రాబోయే రోజుల్లో పెద్ద సినిమాల హడావుడి లేదు. ఈ వారం చిన్న సినిమాలు సైతం విడుదల అవ్వడానికి ధైర్యం చూపించడం లేదు. సో… డీజే హంగామా మరింత రెట్టింపు అయ్యే ఛాన్సుంది.