వేణు శ్రీరామ్ ఎప్పటి నుంచో.. ‘ఐకాన్’ అనే కథ పట్టుకొని తిరుగుతున్న సంగతి తెలిసిందే. అల్లు అర్జున్‌కి ఈ కథ బాగా నచ్చింది. చేస్తా అని మాటిచ్చాడు కూడా. దిల్ రాజు కూడా ప్రొడ్యూసర్‌గా సెట్టయిపోయడు. అయితే రాను రాను బన్నీ మైండ్ సెట్ మారుతూ వచ్చింది. పుష్ప తరవాత.. మాస్, మసాలా కథలే చేయాలని ఫిక్సయ్యాడు. పైగా పాన్ ఇండియా ఇమేజ్ చుట్టే బన్నీ ఆలోచనలు తిరుగుతున్నాయి. అందుకే ఐకాన్ని పక్కన పెట్టాడు. అయితే అటు దిల్ రాజుకీ, ఇటు వేణు శ్రీరామ్‌కీ ఈ కథంటే చాలా ఇష్టం. అందుకే తగిన హీరోని వెదికి పట్టుకొని ప్రాజెక్ట్ ఎలాగైనా పట్టాలెక్కించాలని గట్టి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు.
అందులో భాగంగా ఇప్పుడు ఈ కథ నితిన్ దగ్గరకు చేరిందని టాక్. వేణు శ్రీరామ్ – నితిన్ – దిల్ రాజు కాంబోలో ఈ కథ పట్టాలెక్కే అవకాశం ఉంది. ఇటీవలే నితిన్‌కి వేణు కథ వినిపించాడు. తను పాజిటీవ్‌గానే స్పందించినట్టు తెలుస్తోంది. అయితే… నితిన్ చేతిలో రెండు సినిమాలున్నాయి. వక్కంతం వంశీ సినిమా పూర్తవ్వాలి. భీష్మ కాంబోలో ఓ సినిమా ఇటీవలే మొదలైంది. అది కూడా ఫినిష్ అవ్వాలి. ఆ తరవాతే.. ఈ సినిమా పట్టాలెక్కుతుంది.