ఏపీ రాజధాని కేసులను సుప్రీంకోర్టు వచ్చే డిసెంబర్ కు వాయిదా వేసింది. అత్యవసరం అని.. వెంటనే విచారణ చేపట్టాలని ప్రభుత్వం తరపు లాయర్ అదేపనిగా ఒత్తిడి చేసినా ధర్మాసనం కుదరదని తేల్చి చెప్పేసింది. ఈ పిటిషన్లపై విచారణ ప్రారంభమైన వెంటనే వాదనలు వినిపించేందుకు 3 గంటల సమయం కావాలని ప్రభుత్వ న్యాయవాది కేకే వేణుగోపాల్ విజ్ఞప్తి చేశారు. అయితే ఈ సందర్భంలో ప్రతివాదులందరికీ నోటీసులు పంపే ప్రక్రియ పూర్తయిందా అని ధర్మాసనం ప్రశ్నించింది. ప్రతివాదుల్లో ఇద్దరు చనిపోయారని అమరావతి రైతుల తరఫు న్యాయవాదులు ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. చనిపోయినవారిని జాబితా నుంచి తొలగించాలని కోరిన ఏపీ ప్రభుత్వం కోరింది.
చనిపోయినవారిని జాబితా నుంచి తొలగించినట్టయితే మిగిలిన అందరికీ నోటీసులు అందినట్టేనని తెలిపింది. అయితే ఇంకా మరికొందరికి నోటీసులు అందలేదని చెప్పిన అమరావతి రైతుల తరఫు న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. నోటీసులు అందని ప్రతివాదులందరికీ నోటీసులు పంపాలని ఆదేశించిన ధర్మాసనం.. రాష్ట్ర ప్రభుత్వ అప్పీల్‌ను లీడ్ మ్యాటర్‌గా పరిగణిస్తూ తదుపరి విచారణ వాయిదా వేసింది. తదుపరి విచారణ డిసెంబర్ నెలలో చేపడతామని అప్పుడే తేదీని ఖరారు చేస్తామని తెలిపింది.
కేసు అత్యవసరంగా విచారణ చేపట్టాలని న ఏపీ ప్రభుత్వ తరపు న్యాయవాది మాజీ అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ ధర్మాసనాన్ని కోరారు. అత్యవసరంగా విచారణ సాధ్యం కాదని జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ బేలా ఎం త్రివేది ధర్మాసనం స్పష్టం చేసింది. ఆగష్టు నుంచి నవంబర్ వరకు రాజ్యాంగ ధర్మాసనాలు ఉన్నందున అత్యవసర విచారణ సాధ్యపడదని స్పష్టం చేసింది. డిసెంబర్లోనే విచారణ తేదీలు ఖరారు చేస్తామని తెలిపింది. అమరావతి విషయంలో న్యాయపరంగా ఏపీ ప్రభుత్వానికి ఊరటే లభించడం లేదు. అయితే .. తాను విశాఖలో కాపురం పెడతానని..జగన్ ఇప్పటికే ప్రకటించారు. ఎప్పట్నుంచి అన్నది తేలాల్సి ఉంది.