అమరావతి వ్యాజ్యాల్లో తాము ఇంప్లీడ్ అవుతామంటూ దాఖలయిన పిటిషన్లను హైకోర్టు కొట్టి వేసింది. విశాఖలో నిర్మిస్తున్న స్టేట్ గెస్ట్ హౌస్ .. పరిపాలనా రాజధానిలో భాగంగానే నిర్మించారంటూ.. కొన్ని పిటిషన్లు దాఖలయ్యాయి. వాటిపై హైకోర్టు విచారణ జరుపుతోంది. ఈ సందర్భంగా ఇంప్లీడ్ పిటిషన్లను డిస్మిస్ చేస్తున్నట్లుగా ప్రకటించింది. అదే సమయంలో.. స్టేట్ గెస్ట్ హౌస్ నిర్మాణానికి సంబంధించి మాస్టర్ ప్లాన్ రెడీ అయిన తర్వాత హైకోర్టుకు సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. పరిపాలనా రాజధానిలో భాగంగానే ఆ నిర్మాణం చేస్తున్నట్లుగా స్పష్టమైన సమాచారం ఉంటే.. పిటిషనర్లు కోర్టు దృష్టికి తీసుకు రావొచ్చని ధర్మాసనం స్పష్టం చేసింది. ఆ తర్వాత వాదనలు వింటామని తెలిపింది.
మూడు రాజధానులు సహా.. అమరావతికి సంబంధించి అనేక వివాదాలపై దాఖలైన పిటిషన్లకు సంబంధించి రోజువారీ విచారణను హైకోర్టు ప్రారంభించింది. ఈ సందర్భంగా పిటిషన్లంటిపై … ఒకదాని తర్వాత ఒకటి విచారణ జరుపుతోంది. ఒకే సమస్యపై ఉన్న పిటిషన్లన్నింటినీ కలిపేసింది. హైకోర్టు హైబ్రీడ్ పద్దతిలో విచారణ జరుపుతోంది. భౌతికంగా రాదల్చుకున్న న్యాయవాదులు కోర్టుకు రావొచ్చు.. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణలో పాల్గొనాలనుకున్నవారు హైకోర్టు అనుమతితో విచారణలో పాల్గొనవచ్చు.
ప్రస్తుతం.. మూడురాజధానుల బిల్లుకు ఆమోదం పొందడం చట్ట విరుద్ధమన్న పిటిషన్ దగ్గర్నుంచి రైతుల హామీలలు, సీఆర్డీఏ చట్టం రద్దు తో పాటు .. ఇళ్ల స్థలాలవ వరకూ రాజధాని అంశానికి సంబంధించిన అనేక పిటిషన్లు ప్రస్తుతం హైకోర్టు విచారణలో ఉన్నాయి. రాజధానిలో ఇళ్ల స్థలాల పిటిషన్పై గతంలో హైకోర్టు ఇచ్చిన తీర్పుపై.. ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లింది మొత్తంగా.. అమరావతి అంశం.. న్యాయవివాదాల్లో ఇరుక్కున్నట్లయింది.