వైసీపీ నేతలు ఎన్నికలకు ముందు కూడా తగ్గడం లేదు. ప్రజల్ని పీడించడానికి రెడీ అయిపోయారు. గత సంక్రాంతి సమయంలో సత్తెనపల్లిలో డ్రా పేరుతో కూపన్లు అమ్మి కోట్లు కూడబెట్టిన అంబటి అంబటి రాంబాబు కేసులు అయ్యే సరికి ఈ సారి ప్లాన్ మార్చారు. వైసీప నేతల తెలివితేటలను ప్రదర్శిస్తూ డ్రా కాకుండా ఎంట్రీ ఫీజు అని నిర్దారించారు. అంటే ఓ గ్రౌండ్ లో గేటు పెట్టి సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తారు. అందులో ఎంట్రీ ఫీజు అన్నమాట.
నిజానికి గ్రౌండ్ లో గేటు పెట్టిఎంట్రీ ఫీజు అమ్మాలంటే గేటు దగ్గర అమ్మాలి. కానీ సత్తెనపల్లిలో మాత్రం టిక్కెట్లు పుస్తకాలకు కొద్దీ ప్రింట్ చేసి నియోజకవర్గం మొత్తం పంపి.. బర్క్ గా పార్టీ నేతలు, వ్యాపారస్తులుతో కొనిపిస్తున్నారు. వారు సామాన్యులకు అమ్మాలన్నమాట. ప్రజల్ని ఇంతగా పీడించాల్సిన అవసరం ఏమిటో కానీ.. ఇప్పటికే రాంబాబు.. చనిపోయిన వ్యక్తి పరిహారంలోనూ వాటా అడిగి.. నవ్వుల పాలయ్యారు. అయినా తగ్గడం లేదు.
సత్తెనపల్లి టిక్కెట్ ను ఖరారు చేయించుకున్నారని.. ఎవరు వ్యతిరేకించినా ఆయనకే జగన్ రెడ్డి ఖరారు చేశారన్న ప్రచారంతో … వైసీపీ లోనిఓ వర్గం రగిలిపోతోంది. ఆయన నిర్వాకాలను వరుసగా బయట పెడుతున్నారు. దీంతో సత్తెనపల్లి రాజకీయం ముందు ముందు మరింత రంజుగా సాగే అవకాశం ఉంది.