వైసీపీ మునిగిపోయిన నావ అని క్లారిటీ రావడంతోనే క్రికెటర్ అంబటి రాయుడు ఆ పార్టీకి గుడ్ బై చెప్పారని తేలింది. ఆయన పవన్ కల్యాణ్ తో భేటీ అయి తనను పార్టీ లో చేర్చుకోవాలని కోరినట్లుగా తెలుస్తోంది. రెండు, మూడు ఆయన జనసేనలో చేరిపోయే అవకాశాల ఉన్నాయి. వైసీపీలో చేరిన వారం రోజులకే రాజీనామా ప్రకటించారు అంబటి రాయుడు. కొంత కాలం రాజకీయాలకు విరామం తీసుకుంటానని చెప్పారు. తనకు దుబాయ్‌లో లీగ్ లు ఉన్నాయని అందుకే రాజకీయాలకు విరామం ప్రకటించానని అన్నారు. కానీ అది అబద్దమని పవన్ తో భేటీ ద్వారా క్లారిటీ వచ్చినట్లయింది.
అంబటి రాయుడు మొదటి నుంచి వైసీపీ నేతలతో టచ్ లో ఉన్నారు. ఆయన ఐపీఎల్లో ప్రాతినిధ్యం వహించిన ఇండియా సిమెంట్స్ ఓనర్ శ్రీనివాసన్‌తో సీఎం జగన్మోహన్ రెడ్డికి వ్యాపార సంబంధాలు ఉన్నాయి. అక్కడ నుంటి ట్రై చేసి వైసీపీలో చేర్చుకున్నారు. అంతకు ముందే ఐ ప్యాక్ సాయంతో ఆయనను గుంటూరు జిల్లాలో విస్తృతంగా తిప్పారు. ాఆ సమయంలో ఐ ప్యాక్ స్క్రిప్టులు చదివారు. జగన్ ప్రభుత్వంపై ప్రశంసలు కురిపించారు. కుమ్మకులంపై విద్వేష వ్యాఖ్యలు చేశారు. కానీ క్షేత్ర స్థాయిలో పరిస్థితి ఆయనకు అర్థమయింది.
వైసీపీ మునిగిపోయిన నావ అని ఆ పార్టీలో ఉంటే తన కెరీర్ లో ఐసీఎల్‌లో చేరిన దాని కంటే పెద్ద డిజాస్టర్ అవుతుందని అర్థమైపోయింది. అందుకే వెంటనే బయటకు వచ్చారు. టీడీపీ జనసేన కూటమికి విజయావకాశాలు స్పష్టంగా కనిపిస్తూండటం.. తాను కాపు సామాజికవర్గానికి చెందిన వ్యక్తి కావడంతో.. జనసేనతో అయితే సర్దుకుపోగలరన్న అంచనాకు వచ్చి ఉంటారని భావిస్తున్నారు.