రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014 నుంచి 2019 వరకూ ఏపీలో రాజకీయాలు జరిగాయి. కానీ ఐదేళ్లూ రాష్ట్రానికి రావాల్సి న ప్రయోజనాలు, అభివృద్ది, పరిశ్రమలు అంటూ చర్చే జరిగేది. ఎక్కడా నేరాలు ఘారాలు అధికార పార్టీ నేతల అరాచకాలు జరిగేవి కావు. లా అండ్ ఆర్డర్ సమస్యలు వచ్చేవి కావు. ఎప్పుడూ అభివృద్ధి, పోలవరం, రాజధాని, పరిశ్రమలు … ప్రతీ రోజూ ఇవే అంశాలు కనిపించేవి. దానికి తగ్గట్లుగా ఫలితాలూ కళ్ల ముందు ఉన్నాయి. దేశంలో అతి పెద్ద ఎఫ్ డీఐ కియా రూపంలో ఏపీలోకి వచ్చింది. ఇంకా మూడుప్రాంతాల్లో లెక్కలేనన్ని పరిశ్రమలు వచ్చాయి. దానికి రికార్డుల్లో ఉన్న పెట్టుబడుల వివరాలు… గ్రౌండ్ అయి ఉత్పత్తి ప్రారంంభించిన ఫ్యాక్టరీలే సాక్ష్యం.
ఎప్పుడైతే 2019లో చంద్రబాబు ఓడిపోయి జగన్ సీఎం అయ్యారో అప్పట్నుంచి ఏపీలో అభివృద్ధి గీతలు చెరిగిపోయాయి. కక్షలు ప్రారంభమయ్యాయి. నాలుగున్నరేళ్లు ఎక్కడ చూసినా కరువు తప్ప.. మరొకటి లేదు. పట్టించుకునేవారు లేరు. పూర్తిగా రాజకీయం. ప్రతిపక్ష నేతల్ని ఎలా వేధించాలి… ఎవర్ని లేపేయాలి… ఎవర్ని లోపలేయాలి ఇదే ధ్యాస. ఇవే కుట్రలు. అందర్నీ జైల్లో పెట్టి ఎన్నికలకు వెళ్తే… ప్రజలను బెదిరించి ఓట్లు వేయించుకోవచ్చనో లేకపోతే.. వ్యతిరేక వర్గీయుల్ని ఓటింగ్ కు రాకుండా చేయాలనో చేసే ప్రయత్నం కనిపిస్తోంది. కానీ మన ప్రజాస్వామ్యంలో అది సాధ్యమా ?. సాధ్యమైతే మాత్రం ఇక దేశం దారి మారిపోయినట్లే.
పొరుగు రాష్ట్రంలో రాజకీయాలు జరుగుతున్నాయి. అక్కడా అధికార దుర్వినియోగం జరుగుతోందన్న ఆరోపణలు ఉన్నాయి. కానీ ఇంత ఘోరంగా… అందర్నీ జైళ్లలో పెట్టి తాను గెలవాలన్నంతగా రాజకీయం జరగడం లేదు. ఎందుకంటే ప్రజలు ఎంతో కొంత అవేర్ నెస్ తో ఉంటారని అక్కడి రాజకీయాలకు తెలుసు. కానీ ఏపీ ప్రజల్నే చాలా తక్కువగా అంచనా వేశారు… పాలకులు. వారికి తగిన బుద్ది.. ఓట్లతోనే చెప్పాల్సి ఉంటుంది.