” ఓ వ్యక్తి తన తల్లిదండ్రులను చంపిన కేసులో విచారణ ఎదుర్కొంటున్నాడు. మొత్తం నేర నిరూపణ అయింది. ఇక శిక్ష వేయబోయే ముందు తాను అనాథనని.. తనను వదిలేయాలని న్యాయమూర్తిని వేడుకున్నాడట “… ఇలా ఉంది జగన్ రెడ్డి రాజకీయం. అధికారం చేతికి అందిన తర్వాత దాన్ని నెత్తికెక్కించుకుని కన్నూమిన్నూ కానరాకుండా వ్యవహరిస్తూ.. తల్లీ, చెల్లీని కూడా అవసరం లేదని గెంటేసిన జగన్ రెడ్డి ఏడుపుగొట్టు రాజకీయాలు చేస్తూ.. ప్రత్యర్థులపై బురద చల్లుతూ బతికేయడానికి ప్రయత్నిస్తున్నారు.
ఇసుమంత కూడా ఇంగితం లేని రాజకీయం ఎందుకు ?
కుటుంబాల్లో చిచ్చు పెడతారంటూ.. జగన్ రెడ్డి కాకినాడలో ఏ మాత్రం సంకోచం లేకుండా మాట్లాడేశారు. ఆయన ఎన్ని కుటుంబాల్లో చిచ్చు పెట్టారో కళ్ల ముందే ఉంది. క్యాన్సర్ తో బాధపడే రామోజీరావు కొడుకు సుమన్ ను సైతం ప్రయోగించి ఆ కుటుంబంలో చిచ్చు పెట్టేందుకు ప్రయత్నించారు. ఆ తర్వాత లెక్క చూసుకుంటే ప్రత్యర్థిగా ఉన్న ప్రతీ కుటుంబంలో చిచ్చు పెట్టారు. కానీ జగన్ రెడ్డి కుటుంబంలో ఎవరు చిచ్చు పెట్టారు.. జగన్ రెడ్డే పెట్టుకున్నారు. పార్టీ కోసం కష్టపడిన షర్మిలకు కనీస రాజకీయ ప్రాధాన్యం ఇవ్వలేదు.. ఇక కటుంబపరంగా ఆస్తులు కూడా పంచివ్వలేదని చెబుతున్నారు. ఇలాంటి వాటికి… ఇతరులు ఎలా బాధ్యులవుతారు.
సిగ్గులేకుండా ఇతరులపై నిందలు
వివేకానందరెడ్డిని అడ్డగోలుగా నరికి చంపేశారు. దాన్ని గుండెపోటు అని నమ్మించాలనుకున్నారు. చివరికి విషయం బయటపడింది. హత్యలు ఎవరు చేశారో కూడా స్పష్టత వచ్చింది. కానీ జగన్ రెడ్డి ఏం చేశారు… నిందితుల్ని కాపాడి …. వివేకా కుమార్తె, అల్లుడిపై కేసులు పెట్టించారు. ఎవరు కుటుంబంలో చిచ్చు పెట్టారో తెలుస్తూనే ఉంది. అయినా ఏ మాత్రం సిగ్గు లేకుండా.. తనకు అసలు ఎలాంటి విలువలు.. ఉండవని.. తనదో లేకి మనస్థత్వమన్నట్లుగా ఇతరులపై నిందలేయడానికి ఏ మాత్రం వెనుకడలేదు.
కుటుంబమూ ఛీ కొట్టే ఇలాంటి రాజకీయాలు అవసరమా ?
జగన్ రెడ్డి చేస్తున్న రాజకీయాలు చూసి.. సొంత కుటుంబం కూడా.. ఛీ కొట్టేసింది. అయినా ఆయన తగ్గడం లేదు. ఇప్పుడు జగన్ రెడ్డికి మద్దతుగా ఎవరూ లేరు. సొంత చెల్లినే రాజకీయం చేయడానికి వస్తున్నారు. రేపు ఆయనపైనే పోటీ చేసినా ఆశ్చర్యం లేదు. ఇలాంటి పరిస్థితి తెచ్చుకున్నది జగన్ రెడ్డి అహంకారమే. ఇప్పటికైనా తెలుసుకుని… రాజకీయం అంటే ఏమిటో అర్థం చేసుకుంటే….. సర్వైవ్ అవుతారు..లేదంటే ఎంత పాతాళానికి దిగిపోతారో… అంచనా వేయడం కష్టం.