వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నరేంద్రమోడీపై పూర్తి సానుకూలత ప్రకటించింది. ఆ పార్టీ సీనియర్ నేత.. ఆనం రామనారాయణరెడ్డి.. నరేంద్రమోడీ పర్యటనలో ఏపీ ప్రభుత్వం ప్రోటోకాల్ పాటించలేదని.. చెలరేగిపోయారు. మోడీ గౌరవానికి చంద్రబాబు భంగం కలిగించారంటూ… విమర్శలు గుప్పించారు. చంద్రబాబు ప్రవర్తన సంస్కార హీనంగా ఉంది ఆనం రామనారాయమరెడ్డి బాధపడిపోయారు. ఆంధ్రుల పరువు తీశారని.. ఆవేదన చెందారు. ప్రధాని ఏపీకి అతిథిగా వస్తే అవమానిస్తారా? దూషిస్తారా?.. అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ రకంగా ప్రధాని మోదీకి పూర్తి మద్దతు ప్రకటించినట్లయింది. ఏపీకి మోదీ అతిథిగా వచ్చినప్పుడు గౌరవించి… మనకు ఏం కావాలో వినయం చెప్పుకోవాలని.. ఆనం రామనారాయణరెడ్డి .. చంద్రబాబుకు వినయ విధేయతలు నేర్పే ప్రయత్నం చేశారు. చంద్రబాబు లాంటి సంస్కారహీనుడు ఏపీ సీఎంగా ఉండటం శోచనీయమని కూడా ఆగ్రహించారు. కనీసం మోదీని స్వాగతించేందుకు కూడా ప్రొటోకాల్ అధికారులు… మంత్రులు వెళ్లలేదు…ఇంతకంటే దుర్మార్గం లేదని తీర్మానించారు.
ప్రధాని హోదాలో నరేంద్రమోడీ ఏపీకి వచ్చారు.. వెళ్లారు. ఆయన విభజన హామీలపై మట్లాడతారేమోనని.. ప్రజలంతా ఎదురు చూశారు. కానీ..మోడీ కేవలం చంద్రబాబును తిట్టి… ఏపీకి కావాల్సివన్నీ ఇస్తామని నోటిమాటగా చెప్పి పోయారు. కానీ రైల్వేజోన్ నుంచి ప్రత్యేకహోదా వరకు ఎలాంటి హామీలపైనాప్రకటన చేయలేదు. దీనిపై.. ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమవుతూంటే… వైసీపీ నేతలు మాత్రం.. దీని గురించి స్పందించడం లేదు. మోడీ గౌరవానికి భంగం వాటిల్లుతోందంటూ.. వారు బాధపడిపోతున్నారు. ఓ వైపు .. ఏపీకి ఇవ్వాల్సిన గౌరవం మోడీ ఇవ్వడం లేదని.. ప్రజలు అనుకుంటూంటే.. చంద్రబాబు మోడీకి ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వలేదని.. వైసీపీ ఫీలవుతోంది.
ఆంధ్రప్రదేశ్ కు… బీజేపీ దారుణంగా అన్యాయం చేసినప్పటికీ.. వైసీపీ.. నేతలు మాత్రం.. ఆ పార్టీకే మద్దతు తెలియచేస్తున్నారు. ఏపీ కి ఇచ్చిన హామీలపై నోరు మెదపడం లేదు. కానీ.. టీడీపీనే.. బీజేపీతో నాలుగేళ్లు కలిసి ఉందని.. ఎదురు దాడి చేస్తున్నారు కానీ.. ఇప్పుడు పోరాడే విషయంలో వైసీపీ నేతలు…. ఇంకేదో ప్రయోజనం చూసుకుంటున్నారు.