ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం ఈ నెల 14కు వాయిదా పడింది. రెండ్రోజుల ముందు ఈసీకి సమాచారం పంపాల్సి రావడంతో వాయిదా వేసినట్లు ప్రభుత్వం చెబుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఢిల్లీలో ఇదే విషయాన్ని చెప్పారు. కేబినెట్లో చర్చించే అంశాలను సీఎస్‌కు ఇప్పటికే సీఎంవో పంపింది. ఫణి తుఫాన్, కరువు, నరేగా కూలీలకు నిధుల చెల్లింపునకు అడ్డంకులపై.. చర్చిస్తామంటూ సీఎస్‌కు ఎజెండా పంపారు. సీఎంవో ఇచ్చిన ఎజెండా ప్రకారం.. ఆయాశాఖల కార్యదర్శులకు చీఫ్ సెక్రటరీ ఎల్వీ సుబ్రహ్మణ్యం పూర్తి సమాచారం ఇస్తారు. వారు పంపే సమాచారం వచ్చిన తర్వాత సీఎస్ ఆధ్వర్యంలోని కమిటీ పరిశీలన జరుపుతుంది. ఆతర్వాత ఎజెండాలోని అంశాలను సీఈసీకి సీఎస్ పంపుతారు. కేబినెట్ సమావేశం పెట్టడం ప్రభుత్వం హక్కు, బాధ్యత అని చంద్రబాబు ఢిల్లీలో స్పష్టం చేశారు.
పర్మిషన్లు తీసుకోవాలనే రెండ్రోజులు వాయిదా వేశామని స్పష్టం చేశారు. కేబినెట్లో ఏయే అంశాలు చర్చించాలో మాకు తెలుసని… ఇప్పటికే అథికార పార్టీగా ఉండి మూడు ఎన్నికలను ఎదుర్కొన్నామని చంద్రబాబు గుర్తు చేశారు. అంతకు ముందు … రోజంతా..సచివాలయంలో కేబినెట్ భేటీపై హైడ్రామా చోటు చేసుకుంది. ఉదయం పదో తేదీన కేబినెట్ భేటీ ఏర్పాటు చేయాలంటూ.. సీఎంవో నుంచి వచ్చిన లేఖపై ఆయన… అధికారులతో సమాలోచనలు చేశారు. ఎజెండాలో అంశాలపై సీఈసీ అనుమతి ఇస్తేనే కేబినెట్ సమావేశం జరుగుతుందని.. ఆయన అంటున్నారు. అసాధాణ పరిస్థితులు ఉంటేనే కేబినెట్ నిర్వహణకు కోడ్ అనుమతి ఇస్తుందంటున్నారు. ఏయే అంశాలు అజెండాలో పెట్టాలనేది సీఎం కార్యాలయం సమాచారం ఇచ్చిన తర్వాత … అజెండాపై ఆయా శాఖల నుంచి వివరాలు తీసుకుంటామన్నారు. శాఖలు ఇచ్చిన సమాచారాన్ని సీఎస్ ఆధ్వర్యంలో కమిటీ పరిశీలిస్తోందని… ఆ తర్వాత ఈసీకి పంపుతామంటున్నారు.
కేబినెట్ భేటీ పెట్టాలంటే.. ఈసీకి 48 గంటల ముందు సమాచారం ఇవ్వాలని సుబ్రహ్మణ్యం అంటున్నారు. సీఎస్ మాటలతో… సీఎం వెంటనే వ్యూహం మార్చుకుంది. పధ్నాలుగో తేదీన కేబినెట్ భేటీ పెట్టాలని..సీఎస్‌కు లేఖ రాసింది. ఇక ప్రొసీజర్ ను..సీఎస్ ఫాలో కాక తప్పని పరిస్థితి ఏర్పడింది. కేబినెట్ భేటీ అంశంపై.. ఏపీ సీఈవో ద్వివేదీతోనూ… ఎల్వీ సుబ్రహ్మణ్యం చర్చలు జరిపారు. కేబినెట్ భేటీలో.. బిజినెస్ రూల్స పేరుతో తనపై చర్యలకు తీర్మానాలు చేస్తారేమోననే టెన్షన్ సీఎస్ లో కనిపిస్తోందని.. టీడీపీకి దగ్గరగా ఉండే అధికారవర్గాలు చెబుతున్నాయి.