తెలంగాణ ఏపీ నుంచి విడిపోతే సర్వనాశనం అయిపోతుందని.. వారికి పాలన చేతకాదని.. ఆంధ్రులు తెలివిగలవారని కొంత మంది సూడో మేధావులు విశ్లేషించారు. పదేళ్ల తర్వాత చూస్తే.. అసలు తెలివి తక్కువ వారు ఎవరో ప్రజలకు అర్థమైపోతుంది. అవసరం లేకపోయినా ఆంధ్ర అస్థిత్వం ఉండకూడదని సెక్రటేరియట్ భవనాలను కూల్చేసి సొంత .. కొత్త సచివాలయాన్ని తెలంగాణలో నిర్మించుకుంటే… సొంత రాజధానిపై కుట్రలు చేసుకున్న పాలకులు ఏపీలో ఉన్నారు.
తొలి ఐదేళ్లు ట్రాక్‌లో – మలి ఐదేళ్లు విధ్వంసం
ఇప్పుడు తెలంగాణ ఠీవీగా నిలబడింది. ఏపీ దివాలా అంచున ఉంది. వారానికి నాలుగు వేల కోట్ల అప్పు తెస్తే తప్ప గడవదు. ఎప్పుడు ఈ అప్పుల చైన్ తెగిపోతే అప్పులు దివాలా తీస్తుంది. తొలి ఐదేళ్లు సజావుగానే ఏపీ పాలన సాగింది. తెలుగుదేశం ప్రభుత్వం ఏపీకి అమరావతిని రాజధానిగా నిర్ణయించి.. ఓ కొత్త మోడల్ తో అభివృద్ధి ప్రస్థానాన్ని ప్రారంభించాలని అనుకుంది. ఐదేళ్లలో చంద్రబాబు పోలవరం ప్రాజెక్టుతో పాటు అమరావతిని సమాంతరంగా నిర్మిస్తూ ముందుకెళ్లారు. కానీ ఐదేళ్లకే ప్రజలు వేరే విధంగా ఆలోచించారు. చంద్రబాబుకు ఘోర పరాజయాన్ని ఇచ్చి జగన్మోహన్ రెడ్డి చేతుల్లో రాష్ట్రాన్ని పెట్టారు.
ప్రజలకు తలా పదివేలు ఇస్తే చాలనుకుని మొత్తం నాశనం
జగన్ ప్రాధాన్యాలు వేరు. ఆయన పూర్తిగా సంక్షేమాన్ని మాత్రమే నమ్ముకున్నారు. అన్నీ ఆపేసి ప్రజలకు ఓ పది వేలు పడేస్తే చాలనుకున్నారు. అదే చేశారు. రాజధానిగా అసెంబ్లీలో ఏకగ్రీవంగా అమరావతిని ఖరారు చేసినప్పటికీ నిర్వీర్యం చేశారు. పోలవరాన్ని పడుకోబెట్టారు.
విభజనతో ఏపీ వ్యవసాయ అధారిత రాష్ట్రంగా మారింది. పరిశ్రమలు పెద్దగా లేవు, మొదటి ఐదేళ్లు కియా లాంటి అతి పెద్ద విదేశీ పెట్టుబడుల్ని తీసుకు వచ్చారు. విశాఖ , విజయవాడ,తిరుపతి లాంటి చోట్లకు భిన్న రంగాల పరిశ్రమల్ని ఆకర్షించారు. తిరుపతిని ఎలక్ట్రానిక్ హబ్ గా మార్చే ప్రయత్నంలో అనేక పరిశ్రమల్ని తీసుకు వచ్చారు. కానీ జగన్ అన్నింటినీ నిలిపివేశారు. ఐదేళ్లలో ఏపికి వచ్చిన పరిశ్రమలు, ఉద్యోగావకాశాలు లేవు. అలాగే విద్య కోసం కోసం కూడా విద్యార్థులు పెద్ద ఎత్తున పొరుగు రాష్ట్రాలకు తరలిపోతున్నారు.
మరోసారి ప్రజా తీర్పు ముంగిట ఏపీ !
ఆంధ్ర ఇప్పుడు పదమూడు లక్షల కోట్ల అప్పుల్లో ఉంది. ఆదాయ వనరుల్లేవు. ఐదేళ్లు విధ్వంసం నడిచింది. ఇప్పుడు మరోసారి ప్రజలు మ రాష్ట్రం గురించి ఎలా ఆలోచించారో తీర్పు రావాల్సి ఉంది. కోలుకుంటుందా… లేకపోతే శాశ్వతంగా తెలంగాణ ముందు తేలిపోతుందా అన్నది నాలుగో తేదీన తేలే అవకాశం ఉంది.