ఏపీలో ఇప్పటి వరకూ ముఫ్పై శాతం మందికే జీతాలు వచ్చాయి. మిగతా డెభ్బై శాతం మందికి జీతాలు అందలేదు. అందరికీ పూర్తి స్థాయిలో జీతాలివ్వాలంటే మరో నాలుగు వేల కోట్లు కావాలి. అదే సమయంలో రిజర్వ్ బ్యాంక్ వద్ద ప్రస్తుత ప్రభుత్వం రూ. రెండు వేల కోట్ల వరకూ ఓవర్ డ్రాఫ్ట్ లో ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది. అదే నిజమైతే.. ముందు రాష్ట్రానికి వచ్చే ఆదాయం ఓడీకి జమ చేసుకుంటారు. తర్వాత ఉద్యోగులకు జీతాలు చెల్లిస్తారు. ఆర్బీఐ నుంచి అప్పుల పరిమితి ముగిసిపోయింది.
ఎన్ని ప్రయత్నాలు చేసినా మళ్లీ ఏప్రిల్ లోనే కొత్త అప్పులకు అవకాశం ఉంటుంది. కార్పొరేషన్ల పేరుతో తీసుకున్న రుణాలు దారి మళ్లించడంతో… ఇతర కార్పొరేషన్ల పేరుతో రుణాలు తీసుకోవడం క్లిష్టంగా మారుతోంది. నిజానినికి జనవరిలో ఆర్బీఐ కాకుండా.. . పోర్టుల పేరుతో కార్పొరేషన్ నుంచి రూ. ఐదు వేల కోట్లు రుణం తీసుకున్నారు. ఇది మొత్తం మళ్లించేశారు. కానీ చిన్న కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించలేదు. పార్టీ నేతలకూ బిల్లులు చెల్లించలేదు. ఉద్యోగులకు జీతాలివ్వలేదు.
అన్నీ అయిపోయాయి. అసలు ప్రభుత్వం ఏమీ చేయకుండానే వచ్చే ఆదాయం అంతా కనుమరుగైపోతోంది. చివరికి జీతాల కోసం అప్పుల కోసం దేబిరించాల్సిన పరిస్థితి . ఈ నెల మాత్రమే కాదు.. వచ్చే నెల కూడా పరిస్థితి మరింత భయంకరంగా ఉంటుందని చెబుతున్నారు. ఈ నెలాఖరు వరకూ జీతాలు వేస్తూనే ఉంటారని… వచ్చే నెలలో అది… కొంత మందికి ఏప్రిల్ కు వాయిదా పడినా ఆశ్చర్యం లేదన్న అభిప్రాయం వినిపిస్తోంది.