ఏపీ ప్రభుత్వం ప్రజాధనాన్ని సొంత ధనంగా చెల్లింపులు చేసేస్తోంది. విద్యాశాఖలో చేస్తున్న అవినీతికి అంతే లేకుండా పోతోంది. తాజాగా అసలు ఏ సేవలు ఇంకా పూర్తి స్థాయిలో అందించిన ఎడెక్స్ అనే కంపెనీకి రూ. యాభై కోట్లు ఏకమొత్తంగా చెల్లించాలసి ఆదేశాలు జారీ చేశారు. అమెరికాలో రిజిస్టర్ అయిన ఈ కంపెనీని కర్ణాటకకు చెందిన వ్యక్తి పెట్టారు. ఆన్ లైన్ సర్టిఫికేషన్ కోర్సులు అందిస్తుందని చెబుతున్నారు. ఇప్పటి వరకూ ఏమిచ్చారు.. ముందు ముందు ఏమిస్తారన్నదానిపై క్లారిటీ లేదు. ల
ఆ సంస్థ అందించే సేవలు పొందడానికి టెండర్లు పిలిచారా అంటే అదీ లేదు. నేరుగా ఒప్పందం చేసుకుని వెంటనే డబ్బులు చెల్లిస్తున్నారు. ఏపీలో ఇప్పటికీ సగం మందికి జీతాలు రాలేదు. పెన్షన్లు ఎవరికీ అందలేదు. సామాజిక పెన్షన్లు కూడా చెల్లించలేదు. ఇలాంటి పరిస్థితుల్లో బినామీ కంపెనీలకు ప్రజాధనాన్ని పంపడానికి అడ్డగోలుగా నిర్ణయాలు తీసుకుంటున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి.
ప్రభుత్వానికి బిల్లులు చెల్లింపు ఇప్పుడు టాస్క్ గా మారింది. ప్రభుత్వం మారే అవకాశం స్పష్టంగా ఉండటంతో అస్మదీయులుంతా తమ బిల్లులు ఈ నెలలోనే చెల్లించాలని పట్టుబడుతున్నారు. ఫిబ్రవరిలోనే నోటిఫికేషన్ వస్తుందని ప్రచారం జరుగుతోంది.దీంతో.. .. నిబంధనలకు విరుద్ధమైన సరే.. సొంత వాళ్లకు పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేసేందుకు.,.. ప్రజాధనాన్ని తరలించేందుకు వెనుకాడటం లేదన్న ఆరోపణలు వస్తున్నాయి. విద్యాశాఖలో ఇప్పటికే రకరకాలపేర్లతో వేల కోట్లను కొల్లగొట్టారన్న విమర్శలుఎక్కవగా ఉన్నాయి.