తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దేశంలోనే అత్యంత ఔదార్యం ఉన్న సీఎం. ఆయన పక్క రాష్ట్రాలకు… కష్టం వస్తే ఎవరూ ఊహించనంత సాంయ చేస్తారు. ఆంధ్రప్రదేశ్‌కు హుదూద్ వచ్చినప్పుడు.. భూరి సాయం అందించారు. ఆ తర్వాత వరదల్లో కేరళ అతలాకుతలం అయినప్పుడు.. రూ. 25 కోట్లు ప్రకటించారు. వాటితో పాటు.. వివిధ రకాల సాయం కూడా అందించారు. పుల్వామా ఉగ్రదాడిలో చనిపోయిన ఒక్కో కుటుంబానికి.. రూ. కోటి చొప్పున సాయం ప్రకటించారు. ఇలా చెప్పుకుంటూ పోతే.. కేసీఆర్.. ఉదారంగా చేసిన.. ఎన్నో సాయాలు మన కళ్ల ముందు కనిపిస్తూ ఉంటాయి. అయితే.. ఇప్పుడు… తుఫాన్ ఫొనిపై… కేసీఆర్… కానీ తెలంగాణ సర్కార్ కానీ.. అంటీముట్టనట్లుగా ఉంటోంది.
ఫోని తుఫాన్ కారణంగా.. ఒడిషాలో.. దాదాపు పది జిల్లాలు తీవ్రంగా నష్టపోయాయి. కేసీఆర్‌కు అత్యంత ఇష్టమైన పూరి జగన్నాధుని ఆలయం ఉన్న పూరి కూడా.. తీవ్రంగా నష్టపోయింది. అక్కడ మౌలిక సదుపాయాల కల్పన కోసం.. కొన్ని వేల మంది పని చేస్తున్నప్పటికీ.. ఇబ్బందికర పరిస్థితులు మారడం లేదు. ఏపీ ప్రభుత్వం.. పెద్ద ఎత్తున టార్పాలిన్లు.. ఇతర సహాయ సామాగ్రిని పంపింది. ముఖ్యమంత్రి చంద్రబాబు…. రూ. 15కోట్ల ఆర్థిక సాయం కూడా ప్రకటించారు. అయితే.. అనూహ్యంగా.. కేసీఆర్ మాత్రం.. ఫోని తుపాన్ విషయంపై.. ఎలాంటి ప్రకటనా చేయలేదు. ఎలాంటి సాయం కూడా ప్రకటించలేదు.
నిజానికి.. ఒడిషా ముఖ్యమంత్రితో.. కేసీఆర్‌కు సన్నిహిత సంబంధాలున్నాయి. ఆయనను కూడా ఫెడరల్ ఫ్రంట్‌లో భాగస్వామిగా చేర్చేందుకు… కేసీఆర్ ప్రయత్నాలు చేస్తున్నారు. గతంలో ఓ సారి ఒడిషా వెళ్లి చర్చలు జరిపారు కూడా. ఆ సమయంలో.. ఇద్దరికీ.. ఉమ్మడిగా… వ్యతిరేక ప్రాజెక్టు అయిన.. పోలవరంపై కూడా చర్చించారు. ముందు ముందు ఎన్నికల ఫలితాల తర్వాత కూడా.. పట్నాయక్‌ను కలుపుకుని రాజకీయం చేయాలని… కేసీఆర్ అనుకుంటున్నారు. అయినప్పటికీ… ఫోని దెబ్బకు కుదేలైపోయిన ఒడిషాకు.. సాయం ప్రకటించే విషయంలో.. కేసీఆర్ ఎందుకు మౌనంగా ఉన్నారో మరి..!