రాష్ట్ర ప్రజలకు ఏదైనా అతి పెద్ద సమస్య వస్తే.. దాన్ని పట్టించుకోకుండా ఉండటం జగన్ రెడ్డి స్టైల్ . కాలమే అన్నీ పరిష్కరిస్తుందన్నట్లుగా ప్రజలు అలవాటు పడటమో లేకపోతే.. దానంతటకు అది పరిష్కారం అవడమో జరుగుతుంది. అప్పుడు జగన్ రెడ్డి పబ్లిసిటీతో ముందుకు వస్తారు. అంతా ప్రభుత్వమే చేసిందంటారు. కరోనా సమయంలో జరిగింది అదే. పారాసిటమాల్, బ్లీచింగ్ సలహాలు ప్రజలకు ఇచ్చి పోయినా వాళ్లు పోగా… మిగిలిన వాళ్లను తానే కాపాడుకున్నానని.. వాలంటీర్లు కాపాడారని ప్రచారం చేసుకుంటున్నారు.
ఇప్పుడు ఏపీ లో ఉన్న ఘోరమైన కరువు పరిస్థితుల్లోనూ ఇలాగే వ్యవహరిస్తున్నారు . ఏపీలో వందేళ్లలో రానంత కరువు వచ్చింది వర్షాలు లేవు. రిజర్వాయర్లలో నీళ్లు లేవు. పంటలు ఎండిపోతున్నాయి. అసలు ప్రభుత్వం వైపు నుంచి ఎలాంటి చర్యలు లేవు. ఇంత దుర్భరమైన పరిస్థితుల్లో.. సమస్యను అత్యంత సీరియస్ గా టేకప్ చేయాల్సిన ప్రభుత్వం అసలు కరువు లేదన్నట్లుగా వ్యవహరిస్తోంది. కేబినెట్ సమావేశంలో చర్చించలేదు. కరువు మండలాలను చాలా తక్కువగా ప్రకటించింది. దీందో ఇదే ప్రభుత్వం అని ప్రజలు కూడా విస్తుపోవాల్సిన పరిస్థితి.
కరువు రావడానికి .. జగన్ రెడ్డి లెగ్గుకు సంబంధం లేదు. వైసీపీ వాళ్లు చంద్రబాబును విమర్శించినా… టీడీపీ వాళ్లు జగన్ రెడ్డి వచ్చిన దగ్గర్నుంచి కరోనా సహా విపత్తులన్నీ ఏపీపై పడి దాడి చేస్తున్నాయన్నా…. అది రాజకీయ విమర్శలే. కానీ కరువు వచ్చినా రాలేదని ప్రజల్ని గాలికి వదిలేయడం మాత్రం ఖచ్చితంగా జగన్ రెడ్డి తప్పు. దీన్ని మాత్రం ప్రజలు తేలికగా తీసుకునే అవకాశం ఉండదు. సమస్య వచ్చినప్పుడు పరిష్కరించి ప్రజల మెప్పు పొందాలి కానీ.. అసలు సమస్య లేనట్లుగా వ్యవహరిస్తే అది బాధ్యతారాహిత్యం అవుతుంది. ఓ పాలకుడికి అంత కంటే చేతకానితనం ఉండదు.