హీరోయిన్ జత్వానీ అక్రమ నిర్బంధం కేసులో విజయవాడ పోలీసులు చేసిన మరో నిర్వాకం వెలుగులోకి వచ్చింది. జత్వానీని అరెస్టు చేసిన టైమింగ్ చూస్తే ఎంత పెద్ద కుట్ర ఉందో అర్థమైపోతుంది. సజ్జన్ జిందాల్‌పై ఆమె పెట్టిన కేసులో వాంగ్మూల్ ఇవ్వాల్సిన రోజుకు ఒక్క రోజు ముందు విజయవాడ వెళ్లి అరెస్టు చేసుకొచ్చారు. కనీసం నలభై రోజుల పాటు వారు అందుబాటులో ఉండకుండా చేశారు. ఈ కారణంగా అక్కడి పోలీసులు.. జత్వానీ అందుబాటులో లేదని కేసును క్లోజ్ చేసేశారు.
అదే సమయంలో జత్వానీని అరెస్టు చేసుకొచ్చిన విజయవాడ పోలీసులు ఆమె వద్ద .. ఆమె తల్లిదండ్రుల వద్ద ఉన్న ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ అన్నీ స్వాధీనం చేసుకున్నారు. కానీ కోర్టులో ప్రొడ్యూస్ చేయలేదు. ఆ ఫోన్లలో ఉన్న ఆధారాలు మొత్తాన్ని క్లీన్ చేసి పడేశారు. ముంబై పోలీసులకు ఆమె సమర్పించాల్సిన డిజిటల్ సాక్ష్యాలు కూడా తుడిచేశారు. మాములుగా అయితే స్వాధీనం చేసుకున్నవి కోర్టులో ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది.
ఇంత ఘోరంగా ఓ పారిశ్రామిక వేత్తను కేసు నుంచి కాపాడటానికి పోలీసులు చేసిన వ్యవహారం సంచలనంగా మారుతోంది. తవ్వేకొద్దీ ఇంకెన్ని విషయాలు వెలుగులోకి వస్తాయో కానీ.. వీరు ఐపీఎస్ అధికారులుగా పని చేశారా లేకపోతే కిడ్నాప్ ముఠాలో సభ్యులుగా పని చేశారా అన్న డౌట్ మాత్రం ఎక్కువ మందికి వస్తోంది.