ఉద్యోగులను పీల్చి పిప్పి చేస్తోంది ఏపీ ప్రభుత్వం. అయితే అది పని విషయంలో కాదు. వారు దాచుకుంటున్న సొమ్ముల విషయంలో. విద్యుత్ సంస్థల ఉద్యోగుల పీఎఫ్ సొమ్ము రూ.3,600 కోట్లను ఆసరా పథకానికి మళ్లించేశారు. నాలుగు రోజుల కిందట బటన్ నొక్కిన సీఎం జగన్ వాటికి డబ్బులు మాత్రం సర్దలేకపోయారు. చివరికి కళ్ల ఎదుట విద్యుత్ ఉద్యోగుల పీఎఫ్ సొమ్ముకనిపించడంతో స్వాహా చేసేశారు.
. ఉద్యోగుల వేతనాల నుంచి కట్ చేసిన పీఎఫ్ సొమ్మును ఏపీ ట్రాన్స్‌కో పీఎఫ్ ట్రస్టు, ఏపీ జెన్కో పీఎఫ్ ట్రస్టుల్లో జమ చేస్తారు. వడ్డీ రూపంలో వచ్చే ఆదాయం కోసం ఆ సొమ్మును ఏపీ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్లో (ఏపీపీఎ్‌ఫసీ) ఇన్వెస్ట్ చేశారు. సోమవారానికి ఆ పీఎఫ్ ఇన్వె్‌స్టమెంట్ మెచ్యూర్ అయ్యింది. ఏపీపీఎ్‌ఫసీ వడ్డీతో సహా ఆ డబ్బును తిరిగి ఆ రెండు ట్రస్టులకు ఇచ్చేయాలి. కానీ ఎక్కడ డబ్బుల వాసన కనిపిస్తే అక్కడ వాలిపోతున్న ప్రభుత్వం… వెంటనే ఆ డబ్బులను తీసుకోవడానికి పథకం రచించింది.
ఉద్యోగుల పీఎఫ్ సొమ్ము రూ.3,600 కోట్లను మద్యం బాండ్లలో ఇన్వెస్ట్ చేయించారు. ఆ డబ్బును బేవరేజెస్ కార్పొరేషన్ ఖాతాకు మళ్లించారు. అసలు కంపెనీల చట్టం ప్రకారం ఏర్పడిన బేవరేజెస్ కార్పొరేషన్ నిధులు ప్రభుత్వానికి ఎందుకు మళ్లించాలన్నది ఎవరికీతెలియని విషయం. ఇది చట్ట ఉల్లంఘన . కానీ ఏం చేసినా చెల్లుతోంది. విద్యుత్ ఉద్యోగుల్ని కాపాడటానికి వ్యవస్థలు ముందుకు రాలేదు. ఇప్పుడు ఈ డబ్బులన్నీ వాడేస్తారు. తర్వాత ప్రభుత్వం దగ్గర తిరిగి చెల్లించేంత స్థోమత ఉండదు. ఇక ఉద్యోగుల పీఎఫ్ ఎవరు చెల్లిస్తారు ?